లక్షాధికారుల్ని చేస్తున్న చాట్‌జీపీటీ.. ఎలా అంటారా?

Lance Junck Earns Rs 28 Lakh In 3 Months By Teaching Chatgpt Online - Sakshi

చాట్‌జీపీటీ! సాంకేతిక రంగంలో సరికొత్త సంచలనం. మనుషుల చేసే ఉద్యోగాల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌జీపీటీ టూల్స్‌ చేస్తుండడంతో ఏ నలుగురు ఒకచోట చేరినా దీని గురించే చర్చ. అందుకే టెక్నాలజీ రంగంతో పాటు సామాన్యుల్లో సైతం చాట్‌జీపీటీపై ఆసక్తి నెలకొంది. 

ఈ తరుణంలో చాట్‌జీపీటీ డిమాండ్‌ను పలువురు క్యాష్‌ చేసుకుంటున్నారు. నెలల వ్యవధిలో లక్షలు సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నారు. వారిలో యూఎస్‌కు చెందిన 23 ఏళ్ల లాన్స్ జంక్ ఒకరు. లాన్స్‌ (Lance Junck) చాట్‌జీపీటీ వినియోగించి కేవలం మూడు నెలల్లో రూ.28 లక్షల సంపాదించాడు. ఎలా అంటారా?

ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీని వినియోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. దాన్ని ఎలా వినియోగించాలో తెలియని వాళ్లు ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరుతున్నారు. లాన్స్‌  చాట్‌జీపీటీపై మూడునెలల వీడియో కోర్స్‌ తయారు చేసి ఉడెమీ(Udemy) ఫ్లాట్‌ఫామ్‌లో పెట్టాడు. అలా పెట్టాడో లేదో..ఆ కోర్స్‌ నేర్చుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా 15,000 కంటే ఎక్కువ మంది డబ్బులు చెల్లించి కోర్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నారు. 

ఏడు గంటల కంటే ఎక్కువ నిడివితో ఉన్న ఈ రికార్డ్‌ వీడియో కోర్స్‌ ఖరీదు రూ.3199గా ఉంది. ఇందులో బిగినర్స్‌ కోసం 50 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోల్ని రికార్డ్‌ చేసేందుకు సుమారు 3వారాల సమయం పట్టిందని లాన్స్‌ తెలిపాడు. 
 
కోర్సు నేర్చుకుంటున్న వారి వయసు 20 నుంచి 50 మధ్య ఉండగా.. భారత్‌, కెనడా, జపాన్ వంటి దేశాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు. చాట్‌జీపీటీ అందుబాటులో లేని మిడిల్ ఈస్ట్ ప్రాంతాల నుండి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నారని చెప్పారు. ఈ కోర్స్‌ కొనుగోలు చేయడం ద్వారా తాను మూడు నెలల్లో రూ.28లక్షల సంపాదించినట్లు చెప్పాడు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top