భారత్‌లో లంబోర్గీని రికార్డ్‌ సేల్స్‌; వచ్చే ఏడాదికి భారీ టార్గెట్‌

Lamborghini record sales in India last year sold 92 units in 2022 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సూపర్‌ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఇటలీ సంస్థ ఆటోమొబైలి లంబోర్గీని 2022లో భారత్‌లో 92 యూనిట్లు విక్రయించింది. దేశంలో ఇప్పటి వరకు కంపెనీకి ఇవే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2021తో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించింది.

గతేడాది ప్రపంచవ్యాప్తంగా కంపెనీ నుంచి అత్యధికంగా 9,233 యూనిట్లు రోడ్డెక్కాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మార్కెట్‌ సానుకూలంగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ తెలిపింది. అత్యుత్తమ మార్కెట్లలో భారత్‌ ఒకటిగా నిలిచిందని వెల్లడించింది. 2021తో పోలిస్తే గతేడాది ఆసియా దేశాలు 14 శాతం వృద్ధి సాధించాయి. విక్రయాల పరంగా తొలి స్థానంలో ఉన్న యూఎస్‌ మార్కెట్‌ 10 శాతం అధికంగా 2,721 యూనిట్లు నమోదు చేసింది. భారత్‌లో లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. 

అంతేకాదు 2023 సంవత్సరానికి గాను భారీ టార్గెట్‌ పెట్టకున్నట్టు కంపెనీ కంట్రీ హెడ్  శరద్ అగర్వాల్ తెలిపారు. 2023లో మూడు అంకెల మార్కును ఎలా సాధించి సెంచరీ కొట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top