రూ.150 కోట్లతో కామినేని ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడంటే?

Kamineni Hospitals Opening 150 Bed Super Speciality Hospital In Kurnool - Sakshi

వైద్య సేవల రంగంలో ఉన్న కామినేని హాస్పిటల్స్‌ తాజాగా కర్నూలులో నూతన ఆసుపత్రిని ప్రారంభించింది. జెమ్‌కేర్‌ కామినేని హాస్పిటల్స్‌ పేరుతో రూ.150 కోట్లతో 150 పడకలతో ఇది ఏర్పాటైంది. ఈ ఏడాదే రూ.75 కోట్లతో 75 పడకల సామర్థ్యంతో క్యాన్సర్ చికిత్స కేంద్రం సైతం స్థాపించనున్నారు. 

మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో వైద్య సేవలను ఈ కేంద్రం తదుపరి స్థాయికి మారుస్తుందని సంస్థ తెలిపింది. అందుబాటు ధరలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్టు కామినేని హాస్పిటల్స్‌ వివరించింది. 

కార్డియాక్‌, న్యూరో, అనస్తీషియా, క్రిటికల్‌ కేర్‌, జనరల్‌ మెడిసిన్‌, మెడికల్‌, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌, మినిమల్‌ యాక్సెస్‌ సర్జరీ, ప్లాస్టిక్‌/కాస్మెటిక్‌ సర్జరీ, రెనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, యూరాలజీ, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీస్‌, డయాబెటాలజీ, ఎండోక్రినాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కామినేని ఆస్పత్రి యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top