JSW Steel to replace HDFC Ltd in Sensex from July 13 - Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌.. హెచ్‌డీఎఫ్‌సీ స్థానంలో చోటు 

Jul 6 2023 8:19 AM | Updated on Jul 6 2023 8:33 AM

JSW Steel to replace HDFC in Sensex - Sakshi

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌–30లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు చోటు లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనంకానున్న హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ స్థానే ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్రాతినిధ్యం వహించనుంది. జూలై 13నుంచి తాజా సవరణలు అమలులోకి రానున్నట్లు ఏషియా ఇండెక్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ వెల్లడించింది.

ఏషియా ఇండెక్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈతో భాగస్వామ్యంలో సూచీల కూర్పును చేపట్టే సంగతి తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ దిగ్గజాల విలీనం నేపథ్యంలో ఇతర ఇండెక్సులలోనూ సవరణలకు తెరతీసినట్లు తెలియజేసింది. వీటి ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ స్థానంలో ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ–500లో జేబీఎం ఆటో కంపోనెంట్స్, బీఎస్‌ఈ–100లో జొమాటో, సెన్సెక్స్‌–50లో అపోలో హాస్పిటల్స్‌ ప్రాతినిధ్యం వహించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement