Apple: యాపిల్‌ యూజర్లకు కొత్త సమస్య..! ఒకే చెప్తే ఫోన్‌ డెడ్‌...!

iOS Devices Can Freeze Crash Due to a HomeKit Vulnerability - Sakshi

యాపిల్‌ యూజర్లకు అలర్ట్‌..! యాపిల్‌ ఉత్పత్తులోని ఐవోస్‌లో నెలకొన్న కొత్త సమస్యతో ఆయా యాపిల్‌ ఉత్పత్తులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ సమస్యతో ఆయా యాపిల్‌ ఉత్పత్తులు ఒక్కసారిగా ఫ్రీజ్‌, క్రాష్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సమస్య అదే..!
హోమ్‌కిట్‌ కారణంగా పలు ఐఫోన్‌, ఐప్యాడ్స్‌ పూర్తిగా పనిచేయకుండా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రముఖ టెక్‌ నిపుణుడు ట్రెవర్ స్పినియోలాస్ గుర్తించారు.  ఐవోస్‌ 14.7 వెర్షన్‌తో పాటుగా..తాజా ఐవోస్‌ వెర్షన్‌లో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టులోనే హోమ్‌కిట్‌ సమస్య ఉన్నట్లు ట్రెవర్‌ గుర్తించాడు. ఈ సమస్యను ఇప్పటికే యాపిల్‌కు కూడా నివేదించాడు. యాపిల్‌ కూడా ఈ సమస్యలను 2022లోపు పరిష్కరిస్తామని తెలుపగా ఇప్పటివరకు కంపెనీ పరిష్కారం చూపలేదు. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే యాపిల్‌ యూజర్లు ఎలాంటి యాదృచ్చిక హోమ్‌కిట్‌ పరికరాల ఆహ్వానాన్ని అంగీకరించకూడదని ట్రెవర్‌ సూచించాడు. 

చదవండి: బీఎండబ్ల్యూ దూకుడు..! భారత్‌లో తొలిసారిగా..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top