Elon Musk: మాట తప్పావ్‌ ఎలాన్‌మస్క్‌.. కానీ నువ్వు కార్యసాధకుడివే..

The internet remembered Elon Musk promised to put a man on Mars in 2022 - Sakshi

టెస్లా కార్ల కంపెనీ సీఈవో, అంతరిక్షంలోకి కారెట్లు పంపే స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఫౌండర్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న ఎలాన్‌మస్క్‌కి నెటిజన్లు నిలదీస్తున్నారు. పదేళ్ల కిందట చెప్పిన మాటలు నీటి మీద మూటలు అయ్యాయంటున్నారు. మరికొందరు ఇవాల కాకపోతే రేపయినా ఎలాన్‌ మస్క్‌ అనుకున్నది సాధిస్తాడంటూ నమ్మకం చూపిస్తున్నారు.

స్పేస్‌ కాలనీలు
సరిగ్గా పదేళ్ల కిందట 2011 ఏప్రిల్‌లో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కి చెందిన అలెన్‌ముర్రే అనే జర్నలిస్టుకి ఇచ్చిన ఇంటర్వూలో ఎలాన్‌మస్క్‌ మాట్లాడుతూ పరిస్థితులన్నీ చక్కగా అనుకూలిస్తూ రాబోయే పదేల్లలో మార్స్‌ మీద మానవుల కాలనీలు ఏర్పాటు సాధ్యమే అని చెప్పారు. తమ స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఈ పనిలోనే ఉందంటూ వెల్లడించారు. ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనా మహా అంటే మరో పదిహేను ఇరవై ఏళ్లకైనా ఇతర గ్రహాలపై మనుషులు నివాసం ఉండటం ఖాయమంటూ ఎలాన్‌మస్క్‌ ఆత్మవిశ్వాసం కనబరిచారు.

ఏమైంది బాస్‌
ఇతర గ్రహాలపై మనుషుల నివాసానికి సంబంధించి ఎలాన్‌మస్క్‌ చెప్పిన తొలి గడువు ఇటీవల ముగిసింది. దీంతో నెటిజన్లు పాత ఇంటర్వూను ముంగిట వేసుకుని ఎలాన్‌ మస్క్‌ను నిలదీస్తున్నారు. ఇంకెప్పుడు ఇతర గ్రహాలపైకి మనుషులను తీసుకెళ్తావంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కచ్చితంగా ఎలాన్‌మస్క్‌ అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

చాలానే చేశాడు
గత పదేళ్ల కాలంలో ఎలాన్‌మస్క్‌కి చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ గణనీయమైన వృద్ధినే కనబరిచింది. తొలిసారిగా అంతరిక్ష షటిల్‌ రాకెట్లను తయారు చేయగలగింది. స్పేస్‌టూరిజం వరకు వెళ్లగలిగింది, నాసా లాంటి పెద్ద సంస్థలకు సాధ్యం కాని ఆవిష్కరణలు స్పేస్‌ఎక్స్‌లో జరిగాయి. ఇదే జోరు కనుక కొనసాగితే త్వరలో మస్క్‌ నేతృత్వంలో మనుషులు ఇతర గ్రహాలపై కాలు మోపడం, అక్కడ కాలనీలు ఏర్పాటు చేయడం పెద్ద కష్టమైన పని కాబోదు.

చదవండి: మాయదారి ట్విటర్‌..కరిగిపోతున్న మస్క్‌ సంపద!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top