RealEstate: తొమ్మిది నెలల్లో 3.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 

Institutional investments in Indian real estate nearly usd 4 billion Jan Sep - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌ మధ్య కాలంలో 3.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చా యి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధి అని కొల్లియర్స్‌ సర్వే వెల్లడించింది. ఆయా పెట్టుబడులలో 53 శాతం కార్యాలయ సముదాయంలోకి, 1,802 మిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 537శాతం వృద్ధి రేటుతో రిటైల్‌ విభాగంలోకి 491 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 

గిడ్డంగులు, నివాస సముదాయాల పెట్టుబడులు ఈసారి క్షీణించాయి. క్రితం ఏడాది జనవరి-సెప్టెంబర్‌లో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్‌లోకి 895 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఈసారి 78శాతం  తగ్గి 199 మిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇక గృహ విభాగంలో 472 మిలియన్‌ డాలర్ల నుంచి 42 శాతం క్షీణించి 276 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు చేరుకున్నాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌  మార్కెట్‌లో సంస్థాగత పెట్టుబడులు జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో సంవత్సరానికి 2.5 రెట్లు పెరిగి 754 మిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది  గత  ఏడాది  301 మిలియన్ల డాలర్లతో పోలిస్తే. మొదటి తొమ్మిది నెలల్లో ఈ సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించింది,

బెంగళూరులో పెట్టుబడులు 18 శాతం పెరిగి 317 మిలియన్‌ డాలర్ల నుంచి 375 మిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. చెన్నైకి ఇన్‌ఫ్లోలు 98 మిలియన్‌ డాలర్ల నుంచి 345 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి.ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు 5 శాతం పెరిగి 452  నుంచి 477 మిలియన్‌ డాలర్ల చేరాయి.  అయితే పూణేలో 96 శాతం క్షీణించి  232   9 మిలియన్‌ డాలర్లకు చేరడం గమనార్హం. 

ఇక హైదరాబాద్, కోల్‌కతాలో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌లో ఎలాంటి పెట్టుబడులు రాలేదు.  గత ఏడాది హైదరాబాద్‌కు  486 మిలియన్  డాలర్లు,  కోలకతాకు 105 మిలియన్ల డాలర్లు వచ్చాయి.  గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల సెంటిమెంట్ గ్లోబల్ మందగమనం ఉన్నప్పటికీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనే భావన బలంగా ఉందనీ, ద్రవ్యోల్బణం ,వడ్డీ రేట్లకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక స్థితిపై దీర్ఘకాలిక ప్రభావం  లేదని  సర్వే తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top