ఇన్‌స్టాగ్రాం: ఒకేసారి నలుగురితో లైవ్ 

Instagram Launches Live Rooms Feature - Sakshi

ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఇన్‌స్టాగ్రాం లైవ్‌ రూమ్స్‌ ద్వారా ఒకేసారి నలుగురు వ్యక్తులు లైవ్‌ వీడియోలో మాట్లాడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ప్రారంభంలో కేవలం ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునే వీలు ఉండేది. తర్వాత రోజు రోజుకి కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్ యూత్, కంటెంట్ క్రియేటర్ లను ఆకట్టుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్స్ ఫీచర్ ని తీసుకొచ్చింది. మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్స్ ద్వారా కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొనే అవకాశం ఉండేది. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా నలుగురు వ్యక్తులు ఒకేసారి లైవ్‌ వీడియోలో మాట్లాడుకోవచ్చు. దీనిని మొదట భారతదేశంలోనే బీటా టెస్టింగ్స్ చేసారు. ప్రస్తుతం ఈ ఫీచర్ భారత్, ఇండోనేషియా యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. (చదవండి: గెలాక్సీ ఎ32 5జీలో ఆండ్రాయిడ్ 11)

"ఇన్‌స్టాగ్రామ్‌లో సంస్కృతి, సంప్రదాయాలను, తమ ఆలోచనలను లైవ్ రూమ్స్ ద్వారా క్రియేటర్ లు వ్యక్త పరచడానికి మా వంతు సహకారం అందిస్తాం. రీల్స్ ప్రారంభం నుండి రోల్ అవుట్ వరకు, భవిష్యత్ ఉత్పత్తులను రూపొందించే విధానంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది ”అని ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ అన్నారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్ ఫీచర్‌ను ఉపయోగించడానికి ముందుగా ఇన్‌స్టాగ్రాంలో యువర్ స్టోరీలో ఉన్న ప్లస్‌ సింబల్‌పై క్లిక్ చేయాలి. కింద ఉన్న ఆప్షన్స్‌లో లైవ్ కెమెరా సెలెక్ట్ చేసి సెషన్ పేరు టైప్‌ చేయాలి. తర్వాత లైవ్‌ ఆన్‌ చేసి కింద ఉన్న వీడియో కెమెరా సింబల్‌పై క్లిక్ చేసి గెస్ట్‌లను లైవ్‌లో యాడ్ చేసుకోవచ్చు. కేవలం లైవ్ లో ఉన్న గెస్ట్‌లను మాత్రమే ఆడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్ లో మాత్రమే ముగ్గురు అతిథులను ఆడ్ చేయడానికి అవకాశం ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top