నిధుల బాటలో ఐనాక్స్‌ విండ్‌..ఎన్ని వందల కోట్లంటే!

Inox Wind To Raise Rs350-450 Crore To Reduce Debt - Sakshi

న్యూఢిల్లీ: విండ్‌ ఎనర్జీ సంస్థ ఐనాక్స్‌ విండ్‌ నిధుల సమీకరణ బాట పట్టింది. ఈక్విటీ షేర్ల, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 402.5 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. 

ప్రిఫరెన్షియల్‌ మార్గంలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ప్రమోటర్లు రూ. 150 కోట్లు సమకూర్చనున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. 

ప్రమోటరేతర విదేశీ కంపెనీ సమేనా గ్రీన్‌ లిమిటెడ్‌ ప్రిఫరెన్షియల్‌ షేర్లు, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 153 కోట్లు అందించనున్నట్లు పేర్కొంది. ఇదే విధంగా లెండ్‌ లీజ్‌ కంపెనీ ఇండియా సైతం రూ. 100 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలియజేసింది.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top