ఇన్‌ఫ్రా స్పీడుకు బ్రేకులు.. పడిపోయిన వృద్ధి | Infrastructure Growth Slows to Three Month Low | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్రా స్పీడుకు బ్రేకులు.. పడిపోయిన వృద్ధి

Mar 22 2026 1:24 PM | Updated on Mar 22 2026 3:20 PM

Infrastructure Growth Slows to Three Month Low

న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్‌ వృద్ధి ఫిబ్రవరిలో మూడు నెలల కనిష్టానికి నెమ్మదించింది. రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్షీణించడంతో 2.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఫిబ్రవరిలో ఇది 3.4 శాతంగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఫిబ్రవరిలో ఎరువులు, సిమెంటు, విద్యుదుత్పత్తి వరుసగా 3.4 శాతం, 9.3 శాతం, 0.5 శాతం మేర క్షీణించింది.

అయితే బొగ్గు, ఉక్కు ఉత్పత్తి మాత్రం మెరుగ్గా నమోదైంది. ఇక ఏప్రిల్‌–ఫిబ్రవరి మధ్యకాలంలో ఇన్‌ఫ్రా వృద్ధి 2.9 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 4.4 శాతంగా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తలెత్తడానికి ముందు నుంచే కీలక రంగాల వృద్ధి నెమ్మదించిందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement