Infosys Salary Hike: ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త..!

Infosys Offer Salary Hike From April to Hire 50000 Freshers This Year - Sakshi

ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్‌ తన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్తను అందించనుంది. ఈ నెల నుంచి ఇన్ఫోసిస్‌ తన ఉద్యోగులకు భారీగా వేతనాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   

భారీగా అట్రిషన్‌ రేటు..!
గత ఆర్థిక సంవత్సరానికిగాను నాలుగో త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. మూడో త్రైమాసికం 25.5 శాతంతో పోల్చితే నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు 27.7 శాతానికి పెరిగింది. దీంతో కంపెనీ నుంచి వలసలను తగ్గించేందుకుగాను ఉద్యోగులకు  ఏప్రిల్‌ నుంచి వేతనాలను పెంచేందుకు ఇన్ఫోసిస్‌ సిద్దమైన్నట్లు సమాచారం. ఇక గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50,000 మందిని నియమించుకోనేందుకు ఇన్ఫోసిస్‌ చూస్తోంది.

అంచనాల కంటే తక్కువ..!
 గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2021–22, క్యూ4)లో రూ. 5,686 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 5,076 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 22.7 శాతం ఎగబాకి రూ.32,276 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ఆదాయం రూ.26,311 కోట్లుగా ఉంది. 2021–22 క్యూ3 (అక్టోబర్‌–డిసెంబర్‌ క్వార్టర్‌)లో నమోదైన లాభం (రూ.5,809 కోట్లు)తో పోలిస్తే క్యూ4లో లాభం 2.1 శాతం తగ్గింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం క్యూ3 (రూ.31,867 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా 1.3 శాతం పెరిగింది. కాగా గత నాలుగో త్రైమాసికంతో అంచనాల కంటే తక్కువ వృద్ధిని ఇన్ఫోసిస్‌ నమోదుచేసింది. 

చదవండి: బ్రిటన్‌ రాణిని దాటేసిన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కుమార్తె..! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top