సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన భారత స్టాక్‌మార్కెట్లు

Indian Stock Markets Close In Gains - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 181 పాయింట్లు లాభపడి 19411 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 594 పాయింట్లు లాభపడి 64,958కు చేరుకుంది. సెన్సెక్స్ సంస్థలలో, లార్సెన్ & టూబ్రో లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్‌, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. అదే సమయంలో ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, టైటాన్, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 

ప్రభుత్వరంగ బ్యాంకులు మినహా అన్ని ఇతర రంగాల సూచీలు ఎఫ​్‌ఎంసీజీ, చమురు & గ్యాస్, మీడియా, రియల్టీ రంగ షేర్లు బాగా పుంజుకున్నాయి. భారతదేశ మధ్యకాలిక స్థూల జాతీయవృద్ధి అంచనాను ఫిచ్ 70పాయింట్లు పెంచి 7శాతానికి చేర్చింది. 

ప్రపంచవ్యాప్తంగా సానుకూల సంకేతాలు ఉంటుండడంతో స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అమెరికా మార్కెట్లు స్పష్టమైన లాభాలతో పయణించాయి. ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్ జూన్ నుంచి స్థిరంగా మొదటి ఐదు రోజుల లాభాలను చూసింది. డౌ జోన్స్ ఇండెక్స్ 200 పాయింట్లు లాభపడగా, నాస్డాక్ ఇండెక్స్ 1.4% పెరిగింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top