Vignesh Sundaresan: జస్ట్‌ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్‌..! అది కూడా మన కోసమే..

Indian Investor Paid 500 Crore For NFT - Sakshi

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ట్రెండ్‌ భారీగా కొనసాగుతోంది. క్రిప్టోకరెన్సీతో పాటుగా నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌(ఎన్‌ఎఫ్‌టీ) హవా కూడా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్టిస్టులు వారి ఫోటోలను, ఆడియోలను, వీడియోలను ఎన్‌ఎఫ్‌టీ రూపంతో అమ్ముతున్నారు.   

ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్‌..!
మెటాకోవన్ అని కూడా పిలువబడే భారత్‌కు చెందిన విఘ్నేష్ సుందరేశన్ సుమారు 69.3 మిలియన్ల డాలర్ల(సుమారు రూ.500 కోట్ల)ను వెచ్చించి ‘Every Day: The First 5000 Days’ అనే డిజిటల్‌ ఫోటో ఎన్‌ఎఫ్‌టీను సొంతం చేసుకున్నారు. ఈ ఎన్‌ఎఫ్‌టీ అందరికీ అందుబాటులో ఉంచేందుకుగాను కొన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ ఇంటర్వూలో పేర్కొన్నారు.  ఇంతపెద్దమొత్తాన్ని చెల్లించి ఎన్‌ఎఫ్‌టీను సొంతం చేసుకోవడంతో ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్‌పై ఇతరులు ఆకర్షించడానికి ఎంతో ఉపయోగపడినట్లు తెలుస్తోంది. ‘Every Day: The First 5000 Days’ ఎన్‌ఎఫ్‌టీను మైక్ వింకెల్‌మాన్ రూపొందించిన డిజిటల్ కళ. దీనిని వృత్తిపరంగా బీపుల్ అని పిలుస్తారు. ఈ ఎన్‌ఎఫ్‌టీలో 5000 చిత్రాలను ఒకే ఫోటోగా సృష్టించాడు. 
చదవండి: అనుకోని అతిథిలా వచ్చి..! మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బేసింది..!

అసలు ఏవరి విగ్నేష్‌ సుందరేషన్‌..!
విఘ్నేష్‌ సుందరేశన్‌ అలియాస్‌ మెటాకోవన్‌. బ్లాక్‌ చైయిన్‌ టెకీ. వై-కాంబినేటర్ పూర్వ విద్యార్థి .  విఘ్నేష్ బిట్‌యాక్సెస్‌ను సహ-స్థాపన చేసి ఆరు నెలల్లో 18 దేశాల్లో 100 బిట్‌కాయిన్ ఎటీఎంలను ఏర్పాటు చేసిన ఘనత విఘ్నేష్‌ది. అతను బ్లాక్‌చెయిన్‌లో ఆర్థిక సేవలకు శక్తినిచ్చే క్రెడిట్ ఇంజిన్‌ ఐనా లెండ్రాయిడ్ ఫౌండేషన్ కోసం విజయవంతమైన టోకెన్ విక్రయాన్ని స్థాపించారు.  పోర్ట్‌కీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కూడా స్థాపించాడు. మే 2013లో  సుందరేశన్ ఒక వార్తాపత్రికలో డెవలపర్‌గా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. కాయిన్స్-E అనే ఆన్‌లైన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించారు. దీంతో ఆసక్తి కల్గిన  కస్టమర్‌లు క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేయడానికి ,విక్రయించడానికి వీలు కల్పింస్తోంది.


Every Day: The First 5000 Days ఎన్‌ఎఫ్‌టీ

ఎన్‌ఎఫ్‌టీ అంటే..!
ఎన్‌ఎఫ్‌టీ అంటే డిజిటల్‌ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి  వేలం కూడా వేసుకోవచ్చును. ఎన్‌ఎఫ్‌టీలను కొన్నవారు తిరిగి వాటిని వేలం వేసుకోవచ్చును. ఇలా వేలం జరిగినప్పుడులా వేలం అమౌంట్‌లో 10 శాతం ఎన్‌ఎఫ్‌టీ క్రియోటర్‌కు వాటా దక్కుతుంది.
చదవండి: స్పేస్‌ ఎక్స్‌ దివాళా..! ఉద్యోగులకు ఎలన్‌ మస్క్‌ వార్నింగ్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top