ఎలన్‌ మస్క్‌ వార్నింగ్‌..! వీకెండ్స్‌లో పనిచేయకపోతే..స్పేస్‌ఎక్స్‌ దివాళా తీస్తుంది

Elon Musk Warns SpaceX Employees About SpaceX Bankruptcy - Sakshi

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ ఉద్యోగులకు వార్నింగ్‌ ఇచ్చారు. స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగానికి సంబంధించి ఎలన్‌ మస్క్‌ ఉద్యోగులకు మెయిల్‌ పెట్టారు. ఆ మెయిల్‌లో "ఇటీవల కాలంలో స్టార్‌షిప్ లాంచ్ వెహికల్‌కు ఉపయోగించే రాప్టార్‌ ఇంజిన్‌ తయారీలో చాలా వెనకబడి పోయాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్పేస్‌ఎక్స్‌ సంస్థకు దివాళా తీసే పరిస్థితి తలెత్తుతుంది" అంటూ పేర్కొన్నారు. 

ఎలన్‌ మస్క్‌ మార్స్‌పైన మనిషి మనుగడ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భూమి మీద ఏదైనా ప్రమాదం జరిగి, భూమి మీద మనుగడ అంతరించి పోతే మానవుడు మార్స్‌ మీద జీవించడానికి తన తన సంపద ఉపయోగ పడాలని ఎలన్‌ మస్క్‌ కోరుకుంటున్నాడు. ఆ లక్ష్యంతోనే ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ ముందుకు సాగుతుంది. తాను ఊహించినట్లు భవిష్యత్‌లో మార్స్‌, చంద్రమండలంపై మానువుని మనుగడ కోసం రీయిజబుల్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌తో స్టార్‌ షిప్‌ స్పేస్‌ రాకెట్లను తయారు చేస్తున్నారు.  దీని కోసం ప్రస్తుతం ఉన్న అన్నీ ఎర్త్‌ రాకెట్ల కంటే 1000 రెట్లు ఎక్కువ ఉన్న స్టార్‌ షిప్‌ రాకెట్ ను మోయాల్సి ఉంటుంది. ఆ స్టార్‌ షిప్‌ రాకెట్‌ను మోసేందుకు స్పేస్‌ఎక్స్‌ రాఫ్టర్‌ ఇంజిన్‌లు ఉపయోగపడతాయి.  


 
అయితే ఇప్పుడు ఈ రాప్టర్‌ ఇంజిన్‌ తయారీలో స్పేస్‌ఎక్స్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆ సమస్యని అధిగమించేందుకు స్పేస్‌ ఎక్స్‌ ఉద్యోగులకు ఎలన్‌ మస్క్‌ మెయిల్‌ పెట్టారు. ఉద్యోగులు వారాంతాల్లో పనిచేయాలని, స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగం సంక్షోభంలో ఉందని, దానిని త్వరగా పరిష్కరించకపోతే స్పేస్‌ ఎక్స్‌ దివాలా తీసే ప్రమాదం ఉందని ఉద్యోగులకు చేసిన మెయిల్స్‌లో ఎలన్‌ మస్క్‌ హెచ్చరించినట్లు ది వెర్జ్‌ తన కథనంలో పేర్కొంది.

చదవండి: యాపిల్‌ పరువు తీసి పడేశాడు.. కొత్తేం కాదుగా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top