సొంత ఓఎస్‌పై ప్రభుత్వ భారీ కసరత్తు: ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఖేల్‌ ఖతం?

Indian government planning to rival Android and iOS for phones - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్‌ యూజర్లకు  భారత ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ అందించనుందా? సొంతంగా ఒక  దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించి,  వినియోగదారులకు మరింత సురక్షితమైన అనుభవాన్ని అందించే ప్రాజెక్ట్‌పై పని చేస్తోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 

ఇండ్‌ ఓఎస్‌ పేరుతో తీసుకురానుంది.  ప్రభుత్వం, స్టార్టప్‌లు , విద్యాసంస్థల చొరవతో దీన్ని రూపొందిస్తోంది. ఎపుడు,  ఎలా లాంచ్‌ చేస్తుందనే దానిపై స్పష్టతేదు. ఇది యూజర్లకు ఒక కొత్త భారతీయ OS సురక్షితమైన అనుభవాన్ని అందించడమే కాకుండా Google, Appleకి దీటుగా గట్టి పోటీ ఇస్తుందని అంచనా.
 
కాగా ప్రస్తుతం, గూగుల్‌ ఆండ్రాయిడ్ 97 శాతం వాటాతో టాప్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా,  ఐఫోన్‌కోసం రూపొందించిన ఆపిల్‌ ఐఓఎస్‌ వాటా పరిమితంగానే ఉంది. మరోవైపు నోకియా, శాంసంగ్‌, బ్లాక్‌బెర్రీ నోకియా, మైక్రోసాప్ట్ ,ఫైర్‌ఫాక్స్‌  లాంటి దిగ్గజాల ఆపరేటింగ్ సిస్టమ్స్‌  పెద్దగా ఆదరణకు నోచుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఇండ్‌ఓఎస్‌ ఆవిష్కారంపై భారీ అంచనాలే ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top