సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ 2026–27 అసెస్‌మెంట్ ఏడాదికిగాను 7.8 కోట్లకుపైగా ఆదాయపన్ను రిటర్ను(ఐటీఆర్)లు దాఖలయ్యాయి. ఆదాయపన్ను శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసిన తాజా వివరాల ప్రకారం ఆగస్ట్31కల్లా ఐటీఆర్‌లు 7.8 కోట్లను దాటాయి. గతేడాది 2025 సెప్టెంబర్ 16వరకూ దాఖలైన ఐటీఆర్‌ల సంఖ్య 7.3 కోట్లు మాత్రమే. 2025–26 ఏడాదికి నాన్‌ఆడిట్ కేసుల రిటర్ను దాఖలుకు సెప్టెంబర్ 16 వరకూ గడువిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జూలై31కల్లా ఐటీఆర్–1, ఐటీఆర్–2 ఫైలింగ్స్ 5.9 కోట్లను దాటినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. బిజినెస్‌లు లేదా వృత్తిపరమైన ఆదాయంకలిగిన ఆడిట్ అవసరంలేని పన్ను చెల్లింపుదారులు ఆగస్ట్31కల్లా పూర్తిచేసిన వివిధ ఫైలింగ్‌లతో కలిపి మొత్తం ఐటీఆర్‌ల సంఖ్య 7.8 కోట్లను అధిగమించినట్లు పేర్కొంది. వీటిలో వ్యక్తులు, అవిభాజ్య హిందూ కటుంబాలు(హెచ్‌యూఎఫ్‌లు) ప్రొప్రయిటరీ బిజినెస్ లేదా వృత్తిపరమైన ఆదాయంపై దాఖలు చేసిన ఐటీఆర్–3, చిన్న, మధ్యతరహా పన్ను చెల్లింపుదారుల(రూ. 50 లక్షలలోపు ఆదాయం) ఐటీఆర్–4, సంస్థలు, ఎల్‌ఎల్‌పీ, కోఆపరేటివ్ సొసైటీల ఐటీఆర్–5, కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టరైన సంస్థల ఐటీఆర్–6, ట్రస్టులు, చారిటబుల్ సంస్థల ఐటీఆర్–7 ఉన్నట్లు వివరించింది.
ఇదీ చదవండి: బెర్త్ బుక్ చేసినా.. పడుకోకూడదు!


