
ముంబై: ప్రముఖ అగరబత్తుల సంస్థ జెడ్ బ్లాక్ తన బ్రాండ్ అంబాసిడర్ అయిన క్రికెటర్ మహీంద్రా సింగ్ ధోనితో నూతన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధోని ప్రచారంతో బ్రాండ్ ప్రజలకు మరింత చేరువ అవుతుందని కంపెనీ ఎండీపీహెచ్ (జెడ్ బ్లాక్ గ్రూప్) డైరెక్టర్ అంకిత్ అభిప్రాయపడ్డారు.
‘దేశంలో టాప్–3 బ్రాండ్లలో జెడ్ బ్లాక్ ఒకటి. కంపెనీ వినూత్న ఆవిష్కరణలు, సాధించిన విజయాలు నన్ను సంస్థకు అంబాసిడర్‌గా పనిచేసేందుకు ప్రోత్సాహానిచ్చాయి’’ అని ధోని తెలిపారు.