క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం,పెట్రో ధరలపై ఆఫర్లు డిస్కౌంట్లు

  Icici Bank Hpcl Super Saver Credit Card Get Offter From Fuel - Sakshi

ముంబై: ఇంధన కొనుగోళ్లపై తగ్గింపుల ప్రయోజనాలతో కూడిన కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంకు హెచ్‌పీసీఎల్‌ సూపర్‌ సేవర్‌’ కార్డుతో హెచ్‌పీసీఎల్‌ పెట్రోలియం ఔట్‌లెట్ల వద్ద చేసే చెల్లింపులపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుందని.. ‘హెచ్‌పీపే’ యాప్‌ ద్వారా కార్డుతో చెల్లింపులు చేసినట్టయితే అదనంగా మరో 1.5 శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. వీసా భాగస్వామ్యంతో ఈ కార్డును ఆఫర్‌ చేస్తుండగా.. వార్షిక ఫీజు రూ.500గా ఉంటుంది.

పెట్రోల్, డీజిల్‌ ధరలు గరిష్టాలకు చేరిన తరుణంలో తగ్గింపుల ప్రయోజనాలతో బ్యాంకు ఈ వినూత్నమైన కార్డును ఆవిష్కరించడం మార్కెట్‌ వాటాను పెంచుకునే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. తరచుగా సాంకేతిక అవాంతరాలు తలెత్తుండడంతో నూతన క్రెడిట్‌ కార్డులు జారీ చేయవద్దంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పోటీ సంస్థలైన ఎస్‌బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు.. క్రెడిట్‌ కార్డుల్లో వాటాను పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి.    

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top