వీరి భాగస్వామ్యంతో త్వరలోనే రానున్న ఎయిర్‌ టాక్సీలు..!

Hyundai GM Serious About Flying Car Efforts May Bring Air Taxis As Soon - Sakshi

హ్యుందాయ్, జీఎం భాగస్వామ్యంతో త్వరలోనే రానున్న ఎయిర్‌ టాక్సీలు..!

మార్కెట్‌పై భారీ అంచనాలు

హ్యుందాయ్ మోటార్స్‌, జనరల్‌ మోటార్స్‌ సంయుక్తంగా ఫ్లైయింగ్‌ కార్లపై దృష్టిసారించాయి. వీరి భాగస్వామ్యంతో ఫ్లైయింగ్‌ కార్ల ఉత్పత్తి మరింత వేగం పుంజుకోనుంది. 2025లోపు ఎయిర్‌ టాక్సీలను మొదలు పెట్టాలని ఇరు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఫైయింగ్‌ కార్లలో భాగంగా హ్యుందాయ్‌ ఎస్‌-ఏ1 ఎయిర్‌ టాక్సీలను సీఈఎస్‌-2020 కాన్ఫరెన్స్‌లో ఇప్పటికే రిలీజ్‌ చేయగా, జనరల్‌ మోటార్స్‌ 2021 జనవరిలో ఫైయింగ్‌ కాడిలాక్‌ కాన్సెప్ట్‌ను రిలీజ్‌ చేసింది.

కాగా ఈ ఫ్లైయింగ్‌ కార్లు హైబ్రిడ్‌ ఇంజన్‌ కాన్సెప్ట్‌తో పనిచేయనున్నాయి. ఫ్లైయింగ్‌ కార్ల రాకతో ట్రాఫిక్‌ జామ్స్‌కు చెక్‌పెట్టవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. ఎయిర్‌ టాక్సీల రాకతో వాయు ప్రయాణాల మార్కెట్‌ విలువ 2040 వరకు సుమారు ఒక ట్రిలియన్‌ (రూ. 73 లక్షల 28 వేల 450  కోట్లు)కు చేరగా, అదే 2050 సంవత్సరానికి తొమ్మిది ట్రిలియన్లకు చేరుకుంటుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. కాగా ఫ్లైయింగ్‌ కార్లపై ఇప్పటికే ప్రముఖ స్టార్టప్‌ కంపెనీలతోపాటు, దిగ్గజ ఆటోమోబైల్‌ కంపెనీలు టయోటా మోటార్, డైమ్లెర్ ఏజీ, చైనాకు చెందిన గీలీ మోటార్‌ కంపెనీలు దృష్టిసారించాయి.

చదవండి : Huwaie: వాహనాల తయారీ కాదు.. ఏకంగా డ్రైవర్​లెస్​ కార్!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top