హైబ్రిడ్‌ పథకాల పట్ల ఆకర్షణ | Sakshi
Sakshi News home page

హైబ్రిడ్‌ పథకాల పట్ల ఆకర్షణ

Published Mon, Jul 31 2023 6:39 AM

Hybrid schemes gain traction - Sakshi

న్యూఢిల్లీ: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్‌ క్వార్టర్‌లో రూ.14,021 కోట్లను ఈ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వం ఇటీవల తీసుకొచి్చన నూతన పన్ను నిబంధన కారణమని తెలుస్తోంది. క్రితం ఏడాది ఏప్రిల్‌–జూన్‌ కాలంలో హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచి్చన పెట్టుబడులు రూ.10,084 కోట్లుగా ఉన్నాయి. అంటే సమారు 40 శాతం మేర పెట్టుబడులు పెరిగాయి. హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఈక్విటీ, డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో బంగారం తదితర సాధనాల్లోనూ కొంత మేర పెట్టుబడులు పెడతాయి.

హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) కూడా పెరిగాయి. మధ్యస్థం నుంచి తక్కువ రిస్క్‌ తీసుకునే వారికి హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిస్క్‌ కాస్త తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఇవే హైబ్రిడ్‌ ఫథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.7,420 కోట్లను నికరంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ రూ.7,041 కోట్లు, సెపె్టంబర్‌ త్రైమాసికంలో రూ.14,436 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 2021 డిసెంబర్‌ త్రైమాసికం తర్వాత హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం మళ్లీ జూన్‌ త్రైమాసికంలోనే నమోదైంది.

పన్ను పరమైన అనుకూలత
హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి పెట్టుబడులు రావడం వెనుక పన్ను పరమైన ప్రయోజనాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగిస్తే వచి్చన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి చూపించుకునే అవకాశం ఉండేది. దీంతో పన్ను భారం తక్కువగా ఉండేది. కానీ, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచి్చన నిబంధనల ప్రకారం డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధితో సంబంధం లేకుండా లాభం వార్షిక ఆదాయంలో భాగంగా చూపించి పన్ను చెల్లించడం తప్పనిసరి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించుకునే వెసులుబాటు రద్ధు చేశారు. దీంతో ఆవి ఆకర్షణను కోల్పోయాయి.

డెట్‌ పథకాలకు సంబంధించి పన్ను నిబంధనలో మార్పు హైబ్రిడ్‌ పథకాల్లోకి పెట్టుబడులు పెరిగేందుకు కారణమైనట్టు క్లయింట్‌ అసోసియేట్స్‌ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లి తెలిపారు. ‘‘ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌లో వార్షిక రాబడి 7 శాతంగా ఉంటుంది. డెట్‌ ఫండ్స్‌తో పోలిస్తే పన్ను పరంగా అనుకూలమైనది. అందుకే ఈ విభాగంలో మరింత ఆదరణ కనిపిస్తోంది’’ అని వివరించారు. డెట్‌ ఫండ్స్‌పై పన్ను నిబంధన మారిపోవడంతో ఇన్వెస్టర్లు హైబ్రిడ్‌ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు మారి్నంగ్‌స్టార్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ కౌస్తభ్‌ బేల పుర్కార్‌ తెలిపారు. ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ తక్కువ అస్థిరతలతో, ఈక్విటీ పన్ను ప్రయోజనం కలిగి ఉండడం ఆకర్షణీయమైనదిగా పేర్కొన్నారు. హైబ్రిడ్‌ పథకాల్లో లాభాలకు ఈక్విటీ మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది కనుక తక్కువ పన్ను అంశం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని తెలుస్తోంది.

Advertisement
Advertisement