
పన్ను రిఫండ్‌లకు సంబంధించి వచ్చే మోసపూరిత ఫిషింగ్ ఈ–మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. ఈ పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దని సూచించింది. బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని మె యిల్స్ ద్వారా ఆదాయపన్ను శాఖ ఎప్పుడూ కోరదంటూ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై చేసిన పోస్ట్‌లో పేర్కొంది.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ ఇండియాలోనే..
అధికారిక పోర్టల్ www.incometax.gov.in పైనే పన్ను రిఫండ్ పురోగతి గురించి తెలుసుకోవాలని సూచించింది. ‘ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్.. తక్షణమే మాన్యువల్ ధ్రువీకరణ అవసరం’ అంటూ మెయిల్ వస్తే అది ఫిషింగ్ స్కామ్ కావొచ్చని హెచ్చరించింది. తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని, అటాచ్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని పేర్కొంది. మీ రిఫండ్ స్టేటస్‌ను ట్రాక్ చేయడానికి ఆదాయపు పన్ను పోర్టల్‌లోని ఏఐఎస్, టీఐఎస్ టూల్స్‌ను ఉపయోగించాలని చెప్పింది.