
హైదరాబాద్: వాట్సాప్ ద్వారా కూడా సరుకులు ఆర్డర్ చేసే వెసులుబాటును రిలయన్స్ రిటైల్ జియో మార్ట్ అందుబాటులోకి తెచ్చింది. దీనితో సమయంపరమైన పరిమితులేమీ లేకుండా హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లోని కస్టమర్లు తమ వీలును బట్టి ఆర్డర్ చేయొచ్చని సంస్థ తెలిపింది.
కనీసం రూ. 250 కొనుగోళ్లపై కచ్చితమైన 30 శాతం తగ్గింపును, గరిష్టంగా రూ. 120 వరకూ అందుకోవచ్చని పేర్కొంది. వాట్సాప్ ద్వారా జియోమార్ట్‌లో కొనుగోళ్లు చేసేందుకు +91 7977079770కి సందేశం పంపించవచ్చని వివరించింది.