ఐఫోన్ 12 సిరీస్ తయారీ ఖర్చు ఎంత?

How Much Money Does it Take to Build an iPhone 12 Pro? - Sakshi

భారతదేశంలో ప్రారంభించిన అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఒకటి, ఈ సిరీస్ లో వచ్చిన టాప్-ఎండ్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ధర 1,49,900గా ఉంది. అసలు ఈ ఫోన్ కి ఇంతా ధర ఎందుకు అయ్యిందో మీకు తెలుసా? మొబైల్ లో ఉపయోగించే పరికరాల ధర, సాఫ్ట్ వెర్ బట్టి మొబైల్ యొక్క ధర తెలుస్తుంది. ఇప్పుడు ఐఫోన్ 12 సిరీస్ లలో ఉపయోగించిన పరికరాల విలువ గురుంచి జపనీస్ కంపెనీ అయినా ఫోమల్‌హాట్ టెక్నో సొల్యూషన్స్  నిపుణులు తెలియజేసారు. ఫోమల్‌హాట్ టెక్నో సొల్యూషన్స్  నిక్కీ ఆసియా, (బోమ్) సహకారంతో ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 12 ప్రో కోసం ఉపయోగించిన పరికరాల ధరలను ఒక నివేదిక రూపంలో విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం, ఐఫోన్ 12 తయారీ ధర $ 373 (సుమారు రూ .27,550) కాగా, ఐఫోన్ 12 ప్రో తయారీ ధర $ 406 (సుమారు రూ.30,000). (చదవండి: శామ్‌సంగ్ మల్టీ-ఫోల్డబుల్ ఫోన్‌ను చూశారా..)

ఆపిల్ ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 12 ప్రో ప్రస్తుతం అమెరికాలో 799 డాలర్లు, 999 డాలర్లు అమ్మకానికి ఉన్నాయి. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో తయారీ కోసం అయ్యే ఖర్చు ప్రస్తుత విడుదల చేసిన మొబైల్ ధరలో సగం కంటే తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఆపిల్ 12‌కు తుది ధరను నిర్ణయించే ముందు ఇందులో ఉపయోగించిన భాగాల ఖర్చులు, పన్నులు, మార్కెటింగ్, పరిశోధన మరియు అభివృద్ధి మొదలైన వాటితో సహా అన్ని ఫైనల్ ప్రైస్ లో ఉన్నాయని గమనించాలి. దీనిలో అత్యంత ఖరీదైన భాగాలు వచ్చేసి ఓఎల్ఈడి డిస్ప్లేలు, వీటిని శామ్సంగ్ 70 డాలర్లకు తయారు చేసింది. ఐఫోన్ 12 సిరీస్‌లోని క్వాల్కమ్ X55 5G మోడెమ్ ధర 90 డాలర్లు. ర్యామ్ మరియు ఫ్లాష్ మెమరీ వంటి భాగాలు యూనిట్‌కు 12.8 డాలర్లు, 19.2 డాలర్లు ఖర్చు అవుతాయి. చివరగా, కొత్త ఐఫోన్ 12 ఫోన్‌లలోని టీ సోనీ కెమెరా సెన్సార్లు యూనిట్‌కు 7.4 నుండి 7.9 డాలర్ల మధ్య ఉంటుంది. ఐఫోన్ 12 ఉపయోగించే భాగాలలో 26 శాతం దక్షిణ కొరియా, అమెరికా 21.9 శాతం, జపాన్ 13.6 శాతం నుండి వచ్చాయి. ఐఫోన్లలో ఎక్కువ భాగం ఇప్పటికీ చైనాలో అసెంబుల్ అవుతాయని గమనించాలి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top