హోండా సిటీ : కొత్త వేరియంట్స్ | Honda City 2020 launched | Sakshi
Sakshi News home page

హోండా సిటీ : కొత్త వేరియంట్స్

Sep 1 2020 5:17 PM | Updated on Sep 1 2020 6:49 PM

Honda City 2020 launched - Sakshi

సాక్షి, ముంబై: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) తన పాపులర్ సెడాన్  హోండా సిటీ 2020ని మంగళవారం లాంచ్ చేసింది. హోండీ సిటీ కి చెందిన నాల్గవ తరం రెండు పెట్రోల్ వేరియంట్‌లను  తాజాగా ఆవిష్కరించింది. 9.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభధరగా నిర్ణయించింది.  ఇటీవలే హోండా సిటీ సెడాన్  సరికొత్త 5 వ తరం వెర్షన్‌ను విడుదల చేసిన సంస్థ, 4 వ తరం కారును ఎస్ వీ,  వి గ్రేడ్ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలకనుగుణంగా  1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో (మాన్యువల్‌ ట్రాన్స్ మిషన్)   ఈ కారును అందుబాటులోకి తెచ్చింది. 

బీఎస్ -6 ప్రమాణాలతో , సమకాలీన స్టైలింగ్‌తో తమ పాపులర్ మోడల్‌ 4వ తరం హోండా సిటీ అమ్మకం కొనసాగించాలని  ఆశిస్తున్నామని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , మార్కెటింగ్ అండ్  సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ తెలిపారు.   (చదవండి : ఒకినావా ఆర్30 ఈ స్కూటర్)


 

Advertisement
 
Advertisement
Advertisement