హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సీఈవోగా ఇంకొన్నేళ్లు ఈమే.. | HDFC Life Re appoints Vibha Padalkar as MD CEO for 5 More Years | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సీఈవోగా ఇంకొన్నేళ్లు ఈమే..

Apr 22 2026 4:16 PM | Updated on Apr 22 2026 4:32 PM

HDFC Life Re appoints Vibha Padalkar as MD CEO for 5 More Years

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా విభా పడల్కర్‌ పదవీ కాలాన్ని మరో అయిదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. నామినేషన్, రిమ్యూనరేషన్‌ కమిటీ సిఫార్సుల మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో పడల్కర్‌ పునర్నియామకానికి బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు.

2026 సెప్టెంబర్‌ 12 నుంచి అమల్లోకి వచ్చేలా ఆమెను అయిదేళ్లపాటు కొనసాగించనున్నట్లు సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ పునర్నియామకం అమలుకు రానున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో షేర్‌హోల్డర్ల ఆమోదంతో పాటు ఐఆర్‌డీఏఐ అనుమతి అవసరమని పేర్కొంది.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో పడ్కలర్‌ 2008లో చేరారు. సంస్థలో పలు కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ కంపెనీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. 2017లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లిస్టింగ్‌లోనూ కీలకంగా వ్యవహరించారు. తర్వాత 2018 సెప్టెంబర్‌ 12 నుంచి మూడేళ్ల కాలానికి కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement