హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్‌!

HDFC HDFC Bank Merger NCLT approval - Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) సహా అన్ని రెగ్యులేటరీ సంస్థల నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ విలీనాన్ని వాటాదారులు కూడా ఆమోదించారు.

ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ..  పిజ్జాల కోసం డామినోస్‌ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా?

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్‌హోల్డర్ల యాజమాన్యంలో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన ప్రస్తుత వాటాదారులకు బ్యాంక్‌లో 41 శాతం వాటా ఉంటుంది. 

ఐసీఐసీఐ బ్యాంక్ కంటే పెద్దది
ఈ విలీనం తర్వాత ప్రతి హెచ్‌డీఎఫ్‌సీ వాటాదారు ప్రతి 25 షేర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 42 షేర్లను పొందుతారు. 2021 డిసెంబర్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం.. ఈ విలీనం తర్వాత బ్యాంక్‌ బ్యాలెన్స్ షీట్ రూ. 17.87 లక్షల కోట్లు. నికర విలువ రూ. 3.3 లక్షల కోట్లకు చేరుతుంది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే రెట్టింపు పరిమాణంలో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది.

ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top