డార్క్‌ వెబ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వినియోగదారుల డేటా లీక్‌?

HDFC Bank Denies Data Breach as 7.5GB of Customer Information - Sakshi

ప్రముఖ దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదారుల డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఓ హ్యాకర్‌ వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన 7.5 జీబీ డాటాను డార్క్‌ వెబ్‌లో పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే డేటా గల్లంతుపై వస్తున్న వరుస కథనాల్ని హెచ్‌డీఎఫ్‌సీ యాజమాన్యం కొట్టిపారేసింది. 

ఓ ప్రముఖ అండర్‌గ్రౌండ్‌ హ్యాకర్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వినియోగదారుల సమాచారాన్ని డార్క్‌ వెబ్‌లో పోస్ట్‌ చేశాడు. పైగా అందులో ఎలాంటి పేమెంట్‌ చెల్లించకుండానే డేటాను తీసుకోవచ్చని తెలిపారు. 

ఈ డేటా గల్లంతుపై ఓ మీడియా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి వివరణ కోరింది. ఈ సందర్భంగా బ్యాంక్‌ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ.. మా సంస్థలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించలేరు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస‍్థను వేరేవాళ్లు యాక్సెస్‌ చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. మా కస్టమర్ల వ్యక్తిగత గోప్యతే లక్ష్యంగా.. సంబంధిత వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top