ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్

Gujarat govt to give up to Rs 150000 lakh subsidy on electric cars - Sakshi

ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేడు ఈ-వేహికల్ పాలసీ-గుజరాత్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2021ను విడుదల చేశారు. కొత్త పాలసీ గురించి రాష్ట్ర సమాచార శాఖ ఈ విదంగా తెలిపింది. రాబోయే నాలుగు సంవత్సరాలలో గుజరాత్ రోడ్లపై 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను చూడాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ గుజరాత్ ఎలక్ట్రిక్ వాహన విధానం 2021ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. టూ వీలర్, ఫోర్ వీలర్ ఈ-వాహనాలను భారీగా ప్రోత్సాహకలను ప్రకటించింది.

గుజరాత్ ఈ-వేహికల్ పాలసీలోని ముఖ్యాంశాలు:

 • రాబోయే 4 సంవత్సరాలలో రాష్ట్రంలో ఈ-వాహనాల వినియోగం పెరగడం
 • గుజరాత్ ను ఈ-వాహనాలు, దానికి సంబంధించిన వాటికి కేంద్రంగా చేయడం
 • ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో యువ స్టార్టప్లు, పెట్టుబడిదారులను ప్రోత్సహించడం
 • వాయు కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడటం
 • ప్రస్తుతం ఈ-వాహనాల ఛార్జింగ్ కోసం రాష్ట్రంలో 278 ఛార్జింగ్ స్టేషన్లకు తోడుగా మరో కొత్త 250 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం
 • ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పెట్రోల్ పంపులకు ఆమోదం
 • హౌసింగ్, వాణిజ్య మౌలిక సదుపాయాల వద్ద ఛార్జింగ్ సదుపాయం. 
 • గుజరాత్ ఆర్టీఓలో నమోదైన ఈ-వాహనానికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు 
 • టూ వీలర్ వాహనాలకు రూ.20 వేలు, త్రీ వీలర్ వాహనాలకు 50 వేలు, 4 చక్రాల వాహనాలకు 1.5 లక్షల వరకు సబ్సిడీనేరుగా బ్యాంకు ఖాతాలో జమ
 • కిలోవాట్ పై ఈ-వేహికల్ వాహనాలపై గుజరాత్ ఇతర రాష్ట్రాల కంటే రెట్టింపు సబ్సిడీని ఇస్తుంది.
 • ఈ-వాహనాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఫేమ్ -2 పథకం ప్రయోజనాలతో పాటు ఈ-వాహన కొనుగోలుదారులకు గుజరాత్ ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకలు ఇస్తుంది.

చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పెట్రోల్ ధరలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top