Google Layoffs 2023: ‘ఆహా ఓహో అంటూ ఉద్యోగం నుంచి ఊడబీకారు’!..గూగుల్‌ మహిళా ఉద్యోగి ఆవేదన

Google Layoff Program Manager Katherine Wong After Positive Performance Review - Sakshi

వారానికి ఐదురోజులే పని. ఐదంకెల జీతం. లగ్జరీ జీవితం. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌. కరోనాలోనూ తరగని ఆదాయం. ఛాన్సుంటే రెండు కంపెనీల్లో జాబ్‌. బిటెక్‌ చేశామా? బోనస్‌గా ఏదో ఒక కోర్స్‌ చేశామా? ఐటీ జాబ్‌లో చేరిపోయామా? అంతే! లైఫ్‌ సెటిల్‌ బిందాస్‌గా బ్రతికేయొచ్చు. కొంచెం టెన్షన్‌ ఎక్కువే అయినా దానికి తగ్గట్లు ఇన్‌ కమ్‌ ఉంటుంది. ఇతర ఫెసిలిటీస్‌ ఎలాగూ ఉంటాయి. ఇంకాస్త అదృష్టం తోడైతే విదేశాలకు వెళ్లొచ్చు. డాలర్లను జేబులో వేసుకోవచ్చు. అందుకే యూత్‌కు ఐటీ జాబ్స్‌ అంటే వెర్రీ. కాలు కదపకుండా కంప్యూటర్‌ ముందు చేసే ఉద్యోగమంటే క్రేజ్‌. 

కానీ ఎప్పుడూ లాభాలు వస్తే అది వ్యాపారం ఎందుకవుతుంది. ప్రతీ రోజూ ఈజీగా గడిచి పోతే అది ఉద్యోగం ఎందుకవుతుంది. ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు ఆర్ధిక మాంద్యం సెగ తగులుతోంది. లాభాలు లేవనే కారణంతో.. మాంద్యం వస్తుందన్న భయంతో బడా కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్స్‌ వరకు ఉన్నవాళ్లను పీకేస్తున్నాయి. కొత్త వాళ్లను వద్దంటున్నాయి. దీంతో టెక్కీల ఆదాయం, ఆనందం ఆవిరవుతుంది.

ఆహా ఓహో అంటూ
తాజాగా ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ప్రపంచ వ్యాప్తంగా 12000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారికి పింక్‌ స్లిప్‌ జారీ చేస్తూ ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఈమెయిల్స్‌ పంపారు. అంతే ఆ పింక్‌ స్లిప్‌లు చూసిన టెక్కీల ఆనందం ఆవిరై సోషల్‌ మీడియా వేదికగా తమ బాధల్ని వెళ్లగక్కుతున్నారు.

గూగుల్‌ ఫైర్‌ చేసిన ఉద్యోగుల్లో ప్రోగ్రామ్ మేనేజర్ కేథరీన్ వాంగ్ ఒకరు. ఆహా ఓహో అంటూ ఆకాశానికెత్తిన సంస్థ.. ఆ మరోసటి రోజు లేఆఫ్స్‌ ప్రకటించి అగాధంలోకి నెట్టిందని లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వాపోయారు.
 
ఉద్యోగం నుంచి తొలగించడం బాధగా ఉంది
సంస్థ నుంచి టెర్మినేషన్‌ లెటర్‌ రావడంతో నేనెందుకు? ఇప్పుడెందుకు అనే ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. ఇలాంటి సిచ్యూవేషన్స్‌ను జీర్ణించుకోవడం చాలా  కష్టం. ముఖ్యంగా నా పనితీరు బాగుందని రివ్వ్యూ ఇచ్చిన వెంటనే ఫైర్‌ చేయడం బాధాకరంగా ఉంది. నేను నిర్వహించిన అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇక లేఆఫ్స్‌తో 34 వారాల గర్భిణిగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, నెలల తరబడి ప్రసూతి సెలవుపై వెళ్లడం దాదాపూ అసాధ్యం' అని కేథరిన్ వాంగ్ పేర్కొన్నారు.

ఒంట్లో వణుకు పుడుతుంది
నా బిడ్డ క్షేమం గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించ లేకపోతున్నాను. ఎందుకంటే నా లోపల (గర్బిణి) ఉన్న వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఉద్యోగం పోవడంతో వణుకుతున్న నా చేతుల్ని కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నానంటూ విచారం వ్యక్తం చేశారు.  

ఐ లవ్‌ గూగుల్‌ 
నేను ఇప్పటికీ గూగుల్‌ను ప్రేమిస్తున్నారు. గూగుల్‌ను మేము ఒక కుటుంబంగా భావిస్తాను. ఇప్పటికీ టీం సహచర ఉద్యోగులకు, నాకు వెన్నుదన్నుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో సానుకూల వ్యాపార ధోరణిని అవలంభిస్తున్న గూగుల్‌ కంపెనీలు పనిచేయడం గర్వంగా ఉందని వాంగ్‌ ముగించారు.

చదవండి👉 జొమాటో ‘సీక్రెట్‌’ బయటపడింది, ఫుడ్‌ డెలివరీ స్కామ్‌..ఇలా కూడా చేయొచ్చా!

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top