గూగుల్‌ నుంచి ఇది అసలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు!

Google Engineer Jeremy Joslin On Being Laid Off Via Email After 20 Years Of Service - Sakshi

టెక్‌ దిగ్గజం గూగుల్‌ తొలగించిన 12వేల మంది ఉద్యోగుల్లో జెరెమీ జోస్లిన్ ఒకరు. జోస్లిన్‌ 2003 నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్ధిక మాంద్యం భయాలు, నష్టాల్ని కారణంగా చూపిస్తూ అతడిని తొలగిస్తూ యాజమాన్యం మెయిల్‌ చేసింది. ఆ మెయిల్‌పై జోస్లిన్‌ విచారం వ్యక్తం చేస్తూ లింక్డ్ఇన్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. ఇక ఆ పోస్ట్‌లో ఏముందంటే? 

నేను గత 20ఏళ్లుగా టెక్కీగా పనిచేస్తున్నాను. గూగుల్‌ తొలగింపుల్లో నేను కూడా ఉన్నాను. మొహం మీదే కొట్టినట్లుగా యాజమాన్యం నుంచి ఊహించని విధంగా ఇమెయిల్‌ వచ్చింది. అది చదివి టెక్ జెయింట్‌లో ఇదే నా లాస్ట్‌ వర్క్‌ డే అని ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top