గూగుల్‌ చేతికి మాన్‌డియంట్‌  | Google To Acquire Cybersecurity Firm Mandiant For 5. 4 Billion Dollars | Sakshi
Sakshi News home page

గూగుల్‌ చేతికి మాన్‌డియంట్‌ 

Mar 9 2022 4:02 AM | Updated on Mar 9 2022 4:02 AM

Google To Acquire Cybersecurity Firm Mandiant For 5. 4 Billion Dollars - Sakshi

సిల్వర్‌ స్ప్రింగ్, అమెరికా: టెక్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా సైబర్‌ సెక్యూరిటీ సేవల సంస్థ మాన్‌డియంట్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ 5.4 బిలియన్‌ డాలర్లు. రెండు కంపెనీల మధ్య చర్చలు జరిగిన ఫిబ్రవరి తొలినాళ్లలో మాన్‌డియంట్‌ షేరు విలువకు 57 శాతం అధికం చెల్లించేలా ఒప్పందం కుదిరింది. వర్జీనియా రాష్ట్రంలోని రెస్టన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మాన్‌డియంట్‌లో 5,300 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.

లావాదేవీ ముగిసిన వెంటనే గూగుల్‌ క్లౌడ్‌లో ఈ సంస్థ విలీనమవుతుంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో రష్యా నుంచి సైబర్‌ దాడులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు, ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో ఈ డీల్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. సైబర్‌ సెక్యూరిటీ రంగంలో కన్సాలిడేషన్‌కు ఇది ఆరంభం మాత్రమే కావచ్చని వెడ్‌బుష్‌ అనలిస్ట్‌ డాన్‌ ఐవిస్‌ అభిప్రాయపడ్డారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement