గూగుల్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇక ఆ బెడద ఉండదు

good news Google Workspace Individual storage increased 1TB - Sakshi

న్యూఢిల్లీ:  సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌ యూజర్లకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకూ  ఉన్న 15జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని ఏకంగా 1టీబీ సామర్థ్యానికి పెంచనుంది.  ఈ మేరకు ప్రతి గూగుల్ వర్క్‌స్పేస్ వ్యక్తిగత ఖాతాలో ఆటోమేటిగ్గా 1 టీబీ నిల్వ సామర్థ్యం ఉండేలా అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ విషయాన్ని గూగుల్ తన తాజా బ్లాగ్ పోస్టులో వెల్లడించింది.  దీంతో  గూగుల్‌ స్టోరేజ్‌, జీమెయిల్‌ లాంటి వాటిల్లో స్టోరేజ్‌ బాధ లేకుండా అపరిమితంగా ఫైల్స్‌ను దాచుకోవచ్చు.

ప్రతి Google Workspace వ్యక్తిగత ఖాతా 1 టీబీ సురక్షిత క్లౌడ్ స్టోరేజ్‌తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులు అడగాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఖాతాలో 1 టీబీ స్టోరేజ్‌  స్వయంచాలకంగా స్టోరేజ్‌  అప్‌గ్రేడ్ చేస్తామని బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. 

తాజా చర్య గూగుల్ డ్రైవ్ దాదాపు 100 రకాల ఫైల్స్  స్టోరేజ్‌కు, పీడీఎఫ్, సీఏడీ, జేపీజీ తదితర రకాల ఫైల్స్ స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. వీటిని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్‌లా కన్వర్ట్ చేసుకోకుండానే ఎడిట్ చేసేలా ఆప్షన్స్ ఎనేబుల్ చేయనుంది. దీనికి తోడు గూగుల్ డ్రైవ్ ఇప్పుడు మాల్వేర్, స్పామ్, రాన్సమ్‌వేర్ నుంచి రక్షణగా బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్ ఫీచర్లను అందించనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top