కొనేట్టులేదుగా! మళ్లీ పెరిగిన బంగారం ధర.. | Today Gold And Silver Prices On October 9th 2023 In Hyderabad Increased Again - Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: కొనేట్టులేదుగా! మళ్లీ పెరిగిన బంగారం ధర..

Oct 9 2023 11:56 AM | Updated on Oct 9 2023 12:41 PM

gold price today silver rate today 09 october 2023 - Sakshi

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (అక్టోబర్‌ 9) మళ్లీ పెరిగాయి. వరుసగా నాలుగు రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నాలుగు రోజుల్లో పుత్తడి 10 గ్రాములకు ఏకంగా రూ.1000 దాకా పెరిగింది. 

హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు రూ.200 మేర పెరిగింది. అలాగే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.220 ఎగిసింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  రూ. 53,350లకు చేరింది. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 58,200లకు చేరింది. క్రితం రోజు ధరలు వరుసగా రూ. 53,150, రూ. 57,980గా ఉండేవి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

వెండి కూడా..
Silver rate today: దేశవ్యాప్తంగా ఈరోజు (అక్టోబర్‌ 9) వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీకి రూ.500 చొప్పున వెండి ధర పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.75,500లకు చేరింది. క్రితం రోజు ఇది రూ.75,000 లుగా ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement