
పండగ వేళ బంగారం ధరలు ఇంకా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (జనవరి 15) పసిడి ధరలు మరింత ఎగిశాయి. క్రితం రోజు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు మోస్తరుగా పెరిగాయి.
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర తులం (10 గ్రాములు) రూ.170 చొప్పున పెరిగింది. అదే విధంగా 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.150 చొప్పున పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.63,440, 22 క్యారెట్ల పసిడి తులం ధర రూ. 58,150 ఉంది.
క్లిక్ చేయండి: దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు
Silver Rate: దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ సహా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కేజీకి రూ.300 పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.78,300 లకు చేరింది.