అరచేతిలో ఇమిడిపోయే పర్సనల్‌ కంప్యూటర్‌.. ధర ఎంతంటే?

Fusion5 Windows 11 Pro Fmp4 Mini Pc Review - Sakshi

పర్సనల్‌ కంప్యూటర్లలో కీలక భాగం సీపీయూ (సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌). మానిటర్, కీబోర్డ్, మౌస్‌ వంటివన్నీ పీసీకి సాధనాలు మాత్రమే! సాధారణంగా పర్సనల్‌ కంప్యూటర్‌ బరువు దాదాపు ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు ఉంటుంది.

ఇటీవల ఒక అమెరికన్‌ కంపెనీ ‘ఫ్యూజన్‌5 ఎఫ్‌ఎంపీ4’ బ్రాండ్‌ పేరుతో మినీ పీసీని అందుబాటులోకి తెచ్చింది. ఇది అరచేతిలో ఇట్టే ఇమిడిపోతుంది. దీని బరువు 140 గ్రాములు మాత్రమే! సాధారణ పీసీకి ఉన్నట్లే దీనికి కూడా యూఎస్‌బీ పోర్టులు, హెచ్‌డీఎంఐ పోర్టు, హెడ్‌ఫోన్‌ జాక్, మైక్రో ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌ వంటివన్నీ ఉంటాయి.

‘క్వాడ్‌కోర్‌ ఇంటెల్‌ ఎన్‌4120 ప్రాసెసర్‌’ అమర్చిన ఈ పీసీ ‘విండోస్‌–11’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా పనిచేస్తుంది. డ్యూయల్‌ బాండ్‌ వైఫై కనెక్టివిటీ కూడా ఉండటంతో దీంట్లో ఇంటర్నెట్‌ వాడుకోవడం కూడా తేలికే! దీని ధర 249.99 డాలర్లు (రూ.20,622) మాత్రమే! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top