పరిశ్రమలకు డిజిటల్ అనుమతులు

Fully digital single window clearance for businesses soon: Piyush Goyal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సింగిల్ వెబ్‌సైట్‌ ద్వారా కేంద్ర,  రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల అనుమతుల కోసం చర్యలు చేపట్టామని  కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వెల్లడించారు.  ప్రైవేటు రంగంతో 24 ఉత్పత్తులను ప్రభుత్వం సంయుక్తంగా గుర్తించిందనీ, తద్వారా వచ్చే ఐదేళ్లలో ప్రతి ఉత్పత్తి ఉత్పాదనకు రూ .20 లక్షల కోట్లు పెట్టుబడులను ఆశిస్తున్నట్లు   చెప్పారు.  స్టేట్‌ బిజినెస్‌  అసెస్‌మెంట్ రిపోర్ట్ ఆవిష్కరణలో కేంద్ర మంత్రి  ఈ విషయాలను వెల్లడించారు.  ఉత్పత్తులు / రంగాలపై దృష్టి సారించడం వల్ల ఉద్యోగావకాశాలు కూడా లభించడంతోపాటు దేశంలో ఆర్థిక కార్యకలాపాలను విస్తరిస్తాయన్నారు.

సులభతర వాణిజ్య మెరుగుదల కోసం ఈ చర్యలు చేపడుతున్నామనీ,  సింగిల్ పేమెంట్ గేట్వే ద్వారా త్వరితగతిన అనుమతులు ఇస్తామని వెల్లడించారు.  అలాగే పరిశ్రమల  కోసం లక్ష హెక్టార్ల భూమితో ఇప్పటికే ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేశామనితెలిపారు. కాగా   ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) 2019 ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్,  తెలంగాణ ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top