
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి (68) కన్నుమూశారు. ముంబైలో తన నివాసంలో గుండెపోటుతో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. మార్చి. 15 జూన్ 2009 - 25 ఏప్రిల్ 2014 మధ్య ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే పదవీకాలం ముగిసేలోపు వ్యక్తిగత కారణాలరీత్యా మూడు నెలల ముందే రాజీనామా చేశారు. చక్రవర్తికి భార్య కొడుకున్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ, పరిశోధకుడిగా పనిచేశారు. ఆర్‌బీఐలో చేరడానికి ముందు, చక్రవర్తి పంజాబ్ నేషనల్ బ్యాంక్ , ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రెండేళ్లు ఉన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) ఛైర్మన్‌గా కూడా కొంతకాలం పనిచేశారు.