ఈక్విటీలపై ఎఫ్‌పీఐల ఆసక్తి

Foreign Investors Pivot Towards Indian Stocks For Year-End - Sakshi

డిసెంబర్‌లో రూ. 11,557 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల(డిసెంబర్‌)లో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీలలో నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. అనిశ్చుతులలోనూ రూ. 11,557 కోట్లను నికరంగా ఇన్వెస్ట్‌ చేశారు. రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం, చైనాలో కోవిడ్‌ ఆందోళనల నేపథ్యంలోనూ దేశీ ఈక్విటీలపట్ల ఆసక్తి చూపారు. అయితే సమీప భవిష్యత్‌లో యూఎస్‌ స్థూల ఆర్థిక గణాంకాలు, కోవిడ్‌ పరిస్థితులు ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ప్రభావం చూపనున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

డిపాజిటరీ గణాంకాల ప్రకారం డిసెంబర్‌ 1–23 మధ్య ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 11,557 కోట్ల విలవైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. కాగా.. గత నెల(నవంబర్‌)లో ఎఫ్‌పీఐలు మరింత అధికంగా రూ. 36,200 కోట్లను ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం! ఇందుకు యూఎస్‌ డాలరు బలహీనపడటం, స్థూల ఆర్థిక పరిస్థితుల సానుకూలత దోహదం చేశాయి. అయితే అంతకుముందు అంటే అక్టోబర్‌లో నామమాత్రంగా రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. సెప్టెంబర్‌లో రూ. 7,624 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top