జొమాటో యాప్‌ ద్వారా బుకింగ్‌, టైంకు భోజనం అందలేదని ఏం చేశాడంటే!

Food Delivery Late To Customer, 3000 Fine For Zomato In Bangalore - Sakshi

యశవంతపుర: జొమాటో యాప్‌ ద్వారా బుక్‌ చేసిన భోజనం సమయానికి రాకపోవడంతో ఓ వ్యక్తి కేసు వేయగా రూ. 3 వేల పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరం జొమాటోను ఆదేశించింది. బెంగళూరు రాజాజీనగరలో 2022 ఏప్రిల్‌ 14న రాత్రి అభిషేక్‌ అనే వ్యక్తి యాప్‌ ద్వారా భోజనం ఆర్డర్‌ చేశాడు. గంట సేపైనా భోజనం అందలేదు.

దీంతో ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయగా, డబ్బు కూడా వాపస్‌ రాలేదు. ఈ బాగోతంపై బాధితుడు శాంతినగరంలోని వినియోగదారుల ఫోరంలో రూ. లక్ష పరిహారం ఇప్పించాలని కేసు వేశాడు. విచారణ జరిపిన ఫోరం.. రూ. 3 వేల పరిహారాన్ని అర్జీదారుకు అందజేయాలని జొమాటోను ఆదేశించింది.

చదవండి: వచ్చేస్తోంది, మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీ విడుదల ఎప్పుడంటే? 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top