ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..!

Flipkart Refurbished Phones Sale: Get iPhone 8, 7, 6, 6s, Pixel 3 XL under Budget - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెకండ్ హ్యాండ్ లేదా Refurbished స్మార్ట్‌ఫోన్‌లను ప్రత్యేక సేల్‌లో భాగంగా అమ్మకానికి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో మీకు నచ్చిన యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్‌మీ Refurbished స్మార్ట్‌ఫోన్‌లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ప్రీమియం యాపిల్ ఐఫోన్ 6ఎస్ 16జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.49,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.9,999లకు లభిస్తుంది.

ఈ Refurbished స్మార్ట్‌ఫోన్‌లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు 47 రకాల తనిఖీల చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు కొత్త మొబైల్స్ దీటుగా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. 

యాపిల్ ఐఫోన్ 6ఎస్
Refurbished గోల్డ్ కలర్ ఐఫోన్ 6ఎఎస్ 64జీబీ  వేరియెంట్ కేవలం ₹10,899కు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిలో టచ్ ఐడీ సపోర్ట్ గల 4.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే ఉంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్లో  ఏ9 ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 6ఎస్ 16జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.49,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.9,999లకు లభిస్తుంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది.

యాపిల్ ఐఫోన్ 8
Refurbished యాపిల్ ఐఫోన్ 8 గోల్డ్ 64 జీబీ వేరియంట్ ₹17,999కు లభిస్తుంది. ఐఫోన్ 8లో 4.7 అంగుళాల డిస్ ప్లే, 12 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది ఏ11 బయోనిక్ ప్రాసెసర్ సహాయంతో పనిచేస్తుంది. Refurbished యాపిల్ ఐఫోన్ 7 ₹14,529కు అందుబాటులో ఉంది. ఇందులో ఏ10 ఫ్యూజన్ ప్రాసెసర్ ఉంది.

గూగుల్ పీక్సెల్ 3 ఎక్స్ఎల్
64జిబి ర్యామ్ గల సెకండ్ హ్యాండ్ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ ₹13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్'లో 6.3 అంగుళాల క్యూహెచ్ డి+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది డ్యూయల్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

పీక్సెల్ 3ఏ
కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ ₹10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే, 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లో అదే రియర్ లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల కోసం కేవలం 8 మెగా పిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది.

(చదవండి: లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top