ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్తగా షాపింగ్‌..ముందుగానే ఇంట్లో చూడొచ్చు..!

Flipkart Introduced In Augmented Reality In Shopping - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు సరికొత్త షాపింగ్‌ అనుభూతిని అందించనుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీతో ఫ్లిప్‌కార్ట్‌లోని ఆయా వస్తువులను కస్టమర్లు ముందుగానే తమ ఇంట్లో చూసుకునే సౌకర్యాన్ని ఏర్పాటుచేసింది. ఈ టెక్నాలజీతో కొనుగోలుదారులకు ఆయా వస్తువులపై మరింత అనుభూతిని పొందవచ్చునని ఫ్లిప్‌కార్ట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.


ఫ్లిప్‌కార్ట్‌ కెమెరా సహాయంతో ఆయా వస్తువుల 3డీ ఇమెజ్‌లను ఇంట్లో చూడొచ్చును. ఈ ఫీచర్‌తో ఫర్నిచర్‌, లగేజ్‌, పెద్ద ఉపకరణాల కొనుగోలు విషయంలో ఉపయోగకరంగా ఉండనుంది. వస్తువులను కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌ కెమెరా సహయంతో వస్తువుల పరిమాణం నిర్ధిష్ట స్థలంలో సరిపోతుందా లేదా అనే విషయాన్నికొనుగోలుదారులు సులువుగా అర్థం చేసుకోవడానికి వీలు పడనుంది. 


ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ జయంద్రన్ వేణుగోపాల్ మాట్లాడుతూ..ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్లకు మరింత షాపింగ్‌ అనుభూతిని కల్పించడానికి కంపెనీ పలు చర్యలను తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో, కస్టమర్ల తమ ఇంట్లో ఆయా వస్తువులను ఏఆర్‌ టెక్నాలజీ సాయంతో ముందుగానే చూసే సౌకర్యం కల్గుతుందని తెలిపారు. దీంతో కస్టమర్లు వస్తువులను కొనుగోలు చేయడానికి మరింత సులువుకానుంది. 

ఫ్లిప్‌కార్ట్‌ కెమెరాను ఎలా వాడాలంటే..!

  • మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఓపెన్‌ చేయండి.
  • మీరు కొనుగోలు చేయాలనుకున్న వస్తువుల కోసం సెర్చ్‌ చేయండి. ఆ వస్తువుపై క్లిక్‌ చేయండి.
  • ఆయా వస్తువుకు  ‘వ్యూ ఇన్‌ యూవర్‌ రూమ్‌’ ఆప్షన్‌పై  క్లిక్‌ చేయండి. కొన్ని క్షణాల తరువాత వచ్చే ఏఆర్‌ కెమెరాను అలో చేయండి.
  • తరువాత మీరు ఆ వస్తువును ఉంచదల్చుకున్న ప్రాంతంలో మీకు ఆ వస్తువు 3డీ చిత్రం కెమెరాలో కన్పిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top