ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌సేల్‌: భారీ ఆఫర్లు

Flipkart Announces Its Big Saving Days Sale - Sakshi

మే 2 నుంచి 7వ తేదీ వరకు

స్మార్ట్‌టీవీలపై 75 శాతం వరకు తగ్గింపు

ఎలక్ట్రానిక్  ఉత్పత్తులపై 80 శాతం భారీ తగ్గింపు

సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి డిస్కౌంట్‌ ఆఫర్ల అమ్మకాలను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ పేరుతో  టీవీలు, ఏసీలు, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గింపే ధరలకే విక్రయించనుంది. మే 2 న  మే 7 వరకు  ముగియనున్న  ఈ సేల్‌లో  ఆకర్షణీయమైన ఆఫర్లను అందించనుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం వరకు భారీ ఆఫర్లు అందించనుంది. ఇంకా టీవీల 75 శాతం డిస్కౌంట్ అందించనుంది. అలాగే ఆపిల్‌ శాంసంగ్‌, గూగుల్‌  సంస్థల ఫ్లాగ్‌షిప్‌  స్మార్ట్‌ఫోన్లను కూడా తగ్గింపు ధరల్లో అందించనుంది. అంతేనా ఏసీలు, స్మార్ట్‌ వాచెస్‌, ఇయర్‌ బడ్స్‌, కంప్యూటర్‌ ఉపకరణాల ధరలపై తగ్గింపును ప్రకటించింది. దీనికి అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల ఈఎంఐ ట్రాన్సక్షన్లపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్లు  లభ్యం. (సుజుకి హయాబుసా క్రేజ్: ఆ వేరియంట్‌ ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌!)

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు : ప్రధానంగా  ఐఫోన్‌ 11 ఫోన్ ను ఈ సేల్ లో రూ. 7 వేల తగ్గింపును ప్రకటించింది. తాజా తగ్గింపుతో రూ. 44,999కే లభ్యం. లాంచింగ్‌ ధర  రూ. 51,999.


ఆసుస్ ఆర్‌ఓజి ఫోన్ 3 ధర  46,999 నుంచి ప్రారంభం
ఐక్యూ 3  29,990 
8 జీబీ +128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,990
ఎంఐ 10 టీ సిరీస్‌ను ప్రారంభ ధ 27,999 రూపాయలు

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 62  ఫోన్ రూ. 17, 999 కే  లభించనుంది.
గెలాక్సీ ఎఫ్ 41 6 జీబీర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,499
6 జీబీ ర్యామ్‌ + 64జీబీ స్టోరేజ్  వేరియంట్ ధర రూ. 12,499 
శాంసంగ్‌  గెలాక్సీ ఎఫ్ 12 రూ. 9,999
గూగుల్‌ పిక్సెల్‌ 4 ఏ  ఫోన్ రూ. 26, 999 కే కొనుగోలు చేయవచ్చు. 

వీటితో కంప్యూటర్‌ ఉపకరణాలు రూ. 99 నుంచి లభించనున్నాయి. స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు (70 శాతం వరకు), బ్లూటూత్ స్పీకర్లు (70 శాతం వరకు), ల్యాప్‌టాప్‌లు (40 శాతం వరకు)  పవర్ బ్యాంకులపై డిస్కౌంట్  అందించనుంది.  ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో  75 శాతం తగ్గింపుతో స్మార్ట్ టీవీలు కూడా లభిస్తాయి. వన్‌ప్లస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 14,999లకే కొనుగోలు చేయవచ్చు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top