EPF Interest Rate: దివాళీ స్పెషల్‌, ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

finance ministry approved 8 point 5 percent interest rate on pf deposits for the year 2020-21 - Sakshi

దివాళీ సందర్భంగా ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020-21 సంవత్సరానికి ఖాతాదారులకు 8.5శాతం వడ్డీని అందిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. తద్వరా 6 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ అకౌంట్‌ హోల్డర్లకు లబ్ధి చేకూరనుంది.

వడ్డీ రేట్లను కొనసాగిస్తుంది

ఈపీఎఫ్‌ఓ బోర్డ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఖాతాదారులు ఈపీఎఫ్‌ఓ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నట్లు, వారికి తక్కువ మొత్తంలో కాంట్రిబ్యూషన్‌ ఇవ్వడంపై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఈపీఎఫ్‌ఓ సభ్యుడు  భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ కోవిడ్‌ వల్ల ఆర్ధిక మాంద్యం ఉన‍్నప్పటికీ 2020-21 సంవత్సరానికి వడ్డీ రేట్లను కొనసాగించడంపై కేంద్రప్రభుత్వాన్ని అభినందించాలని అన్నారు. 

ఈపీఎఫ్‌లో ఏదైనా సమస్య ఆన్‌లైన్‌లో ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలి?

మొదట https://epfigms.gov.in/ పోర్టల్ సందర్శించండి

ఫిర్యాదు చేయడం కొరకు 'Register Grievance' మీద క్లిక్ చేయండి.

ఇప్పుడు పీఎఫ్ సభ్యుడు, ఈపీఎస్ పెన్షనర్, యజమాని, ఇతర అనే ఆప్షన్ లలో ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి.

పీఎఫ్ ఖాతా సంబంధిత ఫిర్యాదు కోసం పీఎఫ్ మెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. 

ఆ తర్వాత యుఏఎన్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి 'Get Details' మీద క్లిక్ చేయండి.

యుఏఎన్ తో లింక్ చేయబడ్డ మీ వ్యక్తిగత వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తాయి.

ఇప్పుడు 'గెట్ ఓటిపి' మీద క్లిక్ చేయండి. (ఈపిఎఫ్ఓ డేటాబేస్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు/ ఈమెయిల్ ఐడీకి ఒక్కసారి ఓటీపీ వస్తుంది) 

ఓటీపీ, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు చేయాల్సిన పీపీ నెంబరుపై క్లిక్ చేయండి.

ఇప్పుడు స్క్రీన్ పై పాప్-అప్ కనిపిస్తుంది. దీనిలో, మీ ఫిర్యాదుకు సంబంధించిన బటన్ ఎంచుకోండి.

గ్రీవియెన్స్ కేటగిరీని ఎంచుకొని మీ ఫిర్యాదు వివరాలను ఇవ్వండి. ఒకవేళ మీ వద్ద ఏవైనా రుజువులు ఉన్నట్లయితే, వాటిని అప్ లోడ్ చేయవచ్చు.

ఫిర్యాదు రిజిస్టర్ చేసిన తరువాత, 'Add' మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.

దీని తర్వాత మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్/మొబైల్ నెంబరుకు ఫిర్యాదు రిజిస్టర్ నెంబర్ వస్తుంది.

చదవండి: తరచుగా పీఎఫ్‌ డబ్బులు డ్రా చేస్తే రూ. 35 లక్షలు నష్టపోయినట్లే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top