ఫిక్కీకు కొత్త డైరెక్టర్‌ జనరల్‌ నియామకం | FICCI Announced The Jyoti Vij As DG Shailesh Pathak Secretary General Resigned, More Details | Sakshi
Sakshi News home page

ఫిక్కీకు కొత్త డైరెక్టర్‌ జనరల్‌ నియామకం

Published Wed, Jun 12 2024 12:42 PM | Last Updated on Wed, Jun 12 2024 1:03 PM

Ficci announced the Jyoti Vij as DG Shailesh Pathak secretary general resigned

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) డైరెక్టర్ జనరల్‌గా జ్యోతి విజ్‌  నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం ఫిక్కీలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

1988లో శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1990లో దిల్లీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. 1993లో ఫిక్కీలో చేరిన ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. జ్యోతి నియామకం సందర్భంగా ఫిక్కీ ప్రెసిడెంట్ అనీష్ షా మాట్లాడుతూ..‘జ్యోతి విజ్‌ను డైరెక్టర్‌ జనరల్‌గా నియమించడం సంతోషంగా ఉంది. ఆమె సమర్థ​ంగా విధానాలను రూపొందిస్తారు. ఫిక్కీలో సుధీర్ఘకాలంపాటు సేవలందిస్తున్న జ్యోతి అనుభవం సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఉపయోగపడుతుంది. అది ఫిక్కీకు అదనపు విలువను జోడిస్తుంది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?

ఇదిలాఉండగా, వ్యక్తిగత కారణాలతో ఫిక్కీ సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆయన సర్వీసులో సంస్థకు సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఫిక్కీ ప్రకటన విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement