మినీ రత్న హోదాకు దగ్గర్లో ‘ఫ్యాక్ట్‌’ | FACT Edges Closer to Miniratna Status | Sakshi
Sakshi News home page

మినీ రత్న హోదాకు దగ్గర్లో ‘ఫ్యాక్ట్‌’

Mar 22 2026 7:46 AM | Updated on Mar 22 2026 12:56 PM

FACT Edges Closer to Miniratna Status

కోచి: ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ (ఫ్యాక్ట్‌) మినీరత్న హోదా పొందేందుకు కావాల్సిన దాదాపు అన్ని ముఖ్యమైన నిబంధనలను పూర్తి చేసిందని కంపెనీ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌) అనుపమ్‌ మిశ్రా ప్రకటించారు. ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ కొనసాగుతోందని.. ఇది పూర్తయితే హోదా లభిస్తుందన్నారు.

ఈ హోదాతో కంపెనీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎరువులు సహా ప్రతీ రంగంలోనూ స్వావలంబన దిశగా దేశం అడుగులు వేస్తోందంటూ.. ఈ దిశగా ఫ్యాక్ట్‌ తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు.

‘‘ప్రభుత్వానికి వరుసగా మూడో ఏడాది డివిడెండ్‌లు చెల్లించాం. వరుసగా ఏడు సంవత్సరాల నుంచి లాభాల్లో కొనసాగుతున్నాం. ఐదేళ్లుగా కంపెనీ నికర విలువ సానుకూల స్థితిలో ఉంది. 2018–19లో కంపెనీ టర్నోవర్‌ రూ.18,00–1,900 కోట్లుగా ఉంటే.. నేడు రూ.5,000 కోట్లకు పెరిగింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.50,000 కోట్లకు చేరింది’’అంటూ సంస్థ సాధించిన పురోగతిని మిశ్రా వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement