Unacademy Layoffs: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ..మాట మార్చిన సీఈఓ!

Ed Tech Startup Unacademy Fires 350 Employees After Making A Commitment No Layoffs - Sakshi

కరోనా మహ్మమారి రాకతో చాలా రంగాలు డీలా పడిన సంగతి తెలిసిందే. అయితే వైరస్‌ తగ్గుమఖం పట్టాక పరిస్థితులు తిరిగి యధావిధిగా కొనసాగుతాయని అంతా భావించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని పరిణామాల దృష్ట్యా పలు రంగాల పూర్తిగా కోలుకోవాల్సి ఉంది. ఇటీవల జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఐటీ రంగంలో ఏం జరుగుతుందనేది అర్థం కావడం లేదు. ప్రముఖ దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఎడ్యుటెక్‌ సేవల సంస్థ అనకాడమి మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

ఇదివరకే 600 మంది సిబ్బందికి ఉద్వాసన పలకగా.. తాజాగా మరో 350 మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీ ఖర్చులను తగ్గించి లాభాలను ఆర్జించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఇది మూడవ రౌండ్‌లో జరుగుతున్న తొలగింపులు. దీనికి సంబంధించి కంపెనీ సీఈవో గౌరవ్‌ ముంజల్‌ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో.. కంపెనీ ఖర్చులను తగ్గించే క్రమంలో (కాస్ట్‌ కటింట్‌) క్రమంలో మా అత్యంత ప్రతిభావంతులైన కొంతమంది అనాకాడెమీ ఉద్యోగులకు వీడ్కోలు చెప్పాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పంచుకోవడం నాకు చాలా బాధగా ఉంది. 

ప్రస్తుతం తొలగింపుకు సంబంధించి ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నాను. గతంలో లేఆఫ్స్ చేపట్టకూడదని తాము నిర్ణయించాం. అయితే మార్కెట్ సవాళ్లు వల్ల మా నిర్ణయాలను పునఃపరిశీలించవలసి వచ్చింది. పైగా ఇటీవల పెద్ద మొత్తంలో సంస్థ కోర్ వ్యాపారాలన్ని కూడా ఆఫ్‌లైన్‌కి మారిపోయాయని ముంజల్‌ తెలిపారు. జూలైలో గౌరవ్ ముంజాల్ అన్‌అకాడమీలో లేఆఫ్స్ ఉండవని ఉద్యోగులకు తెలిపారు. కానీ ఈ విషయంలో ఆయన మాట తప్పడంతో క్షమాపణలు కూడా చెప్పారు.

చదవండి: ఆ ఐఫోన్‌ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్‌’!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top