సరుకు డెలివరీకి సరికొత్త ఇ-స్కూటర్‌ 

  e-scooter for commercial delivery launched by Kabira Mobility - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ తయారీలో ఉన్న కబీరా మొబిలిటీ హెర్మ్స్‌‌-75 పేరుతో హైస్పీడ్‌ ఈ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. గోవా ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.89,600. పర్యావరణ అనుకూల మొబిలిటీ పరిష్కారాలను అందించే లక్ష్యం, సరుకు డెలివరీకి ఉపయుక్తంగా ఉండేలా దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. ఒకసారి చార్జ్‌ చేస్తే ఫిక్స్‌డ్‌ బ్యాటరీ అయితే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మార్చుకోవడానికి వీలుండే స్వాపేబుల్‌ బ్యాటరీతో 80 కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. కబీరా ఖాతాలో ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్‌ బైక్స్, ఆరు స్కూటర్‌ మోడళ్లున్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top