దుబాయ్‌ వెళ్లే భారతీయులకు శుభవార్త - ఏంటో తెలుసా.. | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ వెళ్లే భారతీయులకు శుభవార్త - ఏంటో తెలుసా..

Published Fri, Feb 23 2024 5:45 PM

Dubai 5 Year Multiple Entry Visa For Indians - Sakshi

దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) భారత్.. దుబాయ్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా పొందిన వారు ఐదు సంవత్సరాల పాటు మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ సదుపాయాన్ని పొందుతారు.

భారత్ నుంచి 2023 సంవత్సరంలో ఏకంగా 2.46 మిలియన్ల మంది దుబాయ్ వెళ్లినట్లు, ఈ సంఖ్య కరోనా వ్యాపించడానికి ముందు రోజుల కంటే 25 శాతం ఎక్కువని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే 2023లో మొత్తం 17.15 మిలియన్ల మంది దుబాయ్ సందర్శించారు.

2022 ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన వారు 1.84 మిలియన్స్ కాగా.. 2019లో ఈ సంఖ్య 1.97 మిలియన్స్ మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా 2022లో దుబాయ్ వెళ్లిన పర్యాటకుల సంఖ్య 14.36 మిలియన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా 2022లో కంటే గత ఏడాది ఎక్కువ మంది దుబాయ్ సందర్శించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: కాబోయే కోడ‌లి కోసం ఖ‌రీదైన కానుక‌లు.. ఎంతైనా అంబానీ రేంజే వేరు..
 
ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసా అభ్యర్థన స్వీకరించిన తరువాత అన్ని విధాలా ఆమోదం పొందితే.. కేవలం 2 నుంచి 5 పనిదినాల్లో వీసా జారీ చేస్తారు. ఈ వీసా పొందిన తరువాత సంవత్సరంలో 180 రోజులు లేదా 3 నెలలు దుబాయ్‌లో ఉండవచ్చు. అయితే వారు ప్రతి 90 రోజులకు ఒకసారి అనుమతి పొందాల్సి ఉంటుంది. 180 రోజులు దుబాయ్‌లో ఉంటే రెండు సార్లు అనుమతి పొందాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement