జూన్‌లో విమానయానం జూమ్‌..

Domestic air passenger traffic rises nearly 19 per cent in June - Sakshi

దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య జూన్‌లో 1.25 కోట్లుగా నమోదైంది. గతేడాది జూన్‌లో నమోదైన 1.05 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగింది. గో ఫస్ట్‌ కార్యకలాపాలు నిలి్చపోయిన నేపథ్యంలో ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్‌ఏíÙయా ఇండియా, ఆకాశ ఎయిర్‌ తమ తమ మార్కెట్‌ వాటాలను పెంచుకున్నాయి. అయితే, స్పైస్‌జెట్‌ మార్కెట్‌ వాటా మాత్రం మరింత తగ్గింది. ఈ ఏడాది జనవరిలో ఇది 7.3 శాతంగా ఉండగా జూన్‌లో 4.4 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.  

79 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఇండిగో..  63.2 శాతం మార్కెట్‌ వాటా దక్కించుకుంది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా, ఎయిర్‌ఏíÙయా ఇండియా (ప్రస్తుతం ఏఐఎక్స్‌ కనెక్ట్‌గా పేరు మారింది) విమానాల్లో వరుసగా 12.37 లక్షలు, 10.4 లక్షల మంది ప్రయాణం చేశారు. ఎయిరిండియా మార్కెట్‌ వాటా 9.7 శాతంగాను, ఎయిర్‌ఏíÙయా ఇండియా వాటా 8 శాతంగాను ఉంది. 10.11 లక్షల మంది ప్రయాణికులతో విస్తార 8.1 శాతం, 6.18 లక్షల ప్యాసింజర్లతో ఆకాశ ఎయిర్‌ 4.9 శాతం వాటాను దక్కించుకున్నాయి. అటు స్పైస్‌జెట్‌ 5.55 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మరోవైపు, సమయ పాలన విషయంలో 88.3 శాతం ఆన్‌ టైమ్‌ పర్ఫార్మెన్స్‌తో (ఓటీపీ) విస్తార అగ్రస్థానంలో నిల్చింది. ఇండిగో, ఆకాశ ఎయిర్‌ (చెరి 87.6 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కీలకమైన హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో డేటా ఆధారంగా ఓటీపీని లెక్కించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top