అకౌంట్‌లో డబ్బులు కొట్టేసే యాప్స్‌: తక్షణమే డిలీట్‌ చేయండి!

Dangerous Android apps steal money from bank accounts uninstall now - Sakshi

ఆండ్రాయిడ్ యూజర్లూ జాగ్రత్త!  ట్రెండ్ మైక్రో

ఈ  యాప్‌లుంటే వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి!

సాక్షి, న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ యూజర్లు జాగ్రత్త! యూజర్ల బ్యాంకు ఖాతాలనుంచి నగదును తస్కరించే యాప్‌లపై తాజాగా హెచ్చరిక జారీ అయింది.  ఖాతాలో డబ్బులు, బ్యాంకింగ్ సమాచారం, పిన్‌లు, పాస్‌వర్డ్‌లు సహా ఇతర  డేటాను దొంగిలించే లక్ష్యంతో మాల్వేర్ యాప్‌లను ట్రెండ్ మైక్రో భద్రతా పరిశోధన గుర్తించింది.  తక్షణమే అన్‌ఇన్‌స్టాల్‌  చేయాలని హెచ్చరించింది.

ఇలాంటి 17 ఆండ్రాయిడ్‌ యాప్‌లను సంస్థ గుర్తించింది.  ఇవి  మొబైల్ ఫోన్‌లోని టెక్స్ట్ సందేశాలను కూడా అడ్డుకుంటాయని, అలాగే  మరింత ప్రమాదకరమైన మాల్వేర్ బారిన పడేలా చేస్తాయని హెచ్చరించింది.  గూగుల్‌  ప్లేస్టోర్  సేఫ్టీ మెజర్స్‌ను అధిగమిస్తాయని యాప్‌లు డ్రాపర్-యాజ్-ఎ-సర్వీస్ (DaaS) మోడల్‌కు దారితీస్తాయని పేర్కొంది. అందుకే వాటిని డ్రాపర్ యాప్‌లు అంటారని ట్రెండ్ మైక్రోలోని భద్రతా పరిశోధకులు తెలిపారు.  గూగుల్‌ ప్లే స్టోర్లో గత  ఏడాది  ట్రెండ్ మైక్రో కొత్త డా  డ్రాపర్ వెర్షన్‌ను కనుగొంది. వీటిని ప్లేస్టోర్‌ నుంచి తొలగించినప్పటికీ, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో మిగిలి ఉండే అవకాశం ఉంది  కనుక  తక్షణమే తొలగించాలని   సూచించింది. 

డ్రాపర్ యాప్‌ల జాబితా
కాల్ రికార్డర్ APK
రూస్టర్ VPN
సూపర్ క్లీనర్- హైపర్ & స్మార్ట్
డాక్యుమెంట్ స్కానర్ - పీడీఎఫ్‌ క్రియేటర్‌ 
యూనివర్సల్ సేవర్ ప్రో
ఈగిల్ ఫోటో ఎడిటర్
కాల్ రికార్డర్ ప్రో+
అదనపు క్లీనర్
క్రిప్టో యుటిల్స్
 ఫిక్స్‌ క్లీనర్‌
యూనివర్సల్ సేవర్ ప్రో
లక్కీ క్లీనర్
జస్ట్ ఇన్: వీడియో మోషన్
డాక్యుమెంట్ స్కానర్ ప్రో
కాంకర్‌ డార్క్‌నెస్‌
సింప్లీ క్లీనర్
Unicc QR స్కానర్

కాపీ క్యాట్ యాప్‌లను నిషేధించేలా గూగుల్‌ కొత్త విధానాన్ని తీసుకురానుందని సమాచారం. ఇతర యాప్‌ల నుండి లోగోలు, డిజైన్‌లు లేదా టైటిల్స్‌ను క్లోన్ చేసే యాప్‌లపై ఆగస్టు 31 నుండి  నిషేధం అమలు  కానుంది.  వినియోగదారు డేటాను ట్రాక్ చేసే, క్లిక్‌ ద్వారా ప్రకటనలకు దారి మళ్లించే వీపీఎన్‌ఎస్‌ సర్వీస్ ఇందులో భాగం.  అంతేకాదు మొబైల్‌ గేమ్స్‌లో ఫుల్‌ పేజీప్రకటనలపై, 15 సెకన్ల తర్వాత  కూడా క్లోజ్‌ కాని యాడ్స్‌ డెవలపర్లపై ఆంక్షలు సెప్టెంబర్ 30 నుంచి అమలు కానున్నాయి. స్క్రీన్ లోడింగ్ సమయంలో/గేమ్‌ ముందు లేదా తరువాతి లెవల్‌ ప్రారంభించే ముందు కనిపించే ప్రకటనల్ని గూగుల్‌ నిరోధిస్తుందని నివేదిక పేర్కొంది. అయితే, గేమ్‌లో రివార్డ్‌లను అన్‌లాక్ చేసే ప్రకటనలకు ఇది వర్తించదట.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top